రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు వైఎస్ షర్మిల ఫోన్.. రాష్ట్రంలో నిరుద్యోగుల అంశంపై ఉమ్మడి కార్యాచరణకు పిలుపు

YSRTP Chief YS Sharmila Phone To Revanth Reddy and Bandi Sanjay Call For Joint Action on Unemployment,YSRTP Chief YS Sharmila Phone To Revanth Reddy,YS Sharmila Phone To Revanth Reddy and Bandi Sanjay,YS Sharmila Call For Joint Action on Unemployment,YSRTP Chief YS Sharmila Joint Action on Unemployment,Mango News,Mango News Telugu,YSRTP Chief YS Sharmila,YS Sharmila Phone Call,YS Sharmila Seeks Joint Action Plan,YSRTP Chief YS Sharmila Latest News,YS Sharmila Phone Call News Today,YS Sharmila on Unemployment Latest Updates

తెలంగాణ రాజకీయాల్లో శనివారం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. దీనికోసం ఉమ్మడి ఐక్య కార్యాచరణను సిద్ధం చేద్ధామని ఇరువురు నేతలకు చెప్పారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మధ్య ప్రతిపక్షాలు అన్ని కలిసి పనిచేయాలన ఆవశ్యకతను షర్మిల వారికీ తెలియజేశారు. సీఎం కేసీఆర్ నిరంకుశ ధోరణిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని, కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో బతకనియ్యరని షర్మిల అన్నారు. ఈ క్రమంలో అన్ని ప్రతిపక్షాల నేతృత్వంలో ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని ఆమె సూచించారు.

ఇక షర్మిల ఫోన్ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు. కాగా షర్మిల మార్చి 31న టీఎస్ పీఎస్ సీ ముట్టడికి బయల్దేరగా ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై స్పందించిన షర్మిల.. పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమైనా క్రిమినల్‌నా? అని షర్మిల ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 12 =