ఏప్రిల్ 1 నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు

TTD Decides to Resume All Arjita Sevas in Tirumala Srivari Temple from April 1, TTD Decides to Resume All Arjita Sevas in Tirumala Srivari Temple, All Arjita Sevas in Tirumala Srivari Temple from April 1, Tirumala Srivari Temple, Arjita Sevas in Tirumala Srivari Temple from April 1, TTD, Tirumala Tirupati Devasthanam, Tirumala Venkateswara Temple, Arjita Sevas in Tirumala Srivari Temple, Tirumala Srivari Temple, Arjita Sevas, Arjita Sevas Latest News, Arjita Sevas Latest Updates, Tirumala Tirupati Devasthanam to Resume All Arjita Sevas in Tirumala Srivari Temple from April 1, Mango News, Mango News Telugu,

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేరకు టీటీడీ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లు నిర్వ‌హిస్తారు. అయితే కోవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుందని తెలిపారు.

అదేవిధంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటుగా వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగనుంది. కాగా వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదుని, వారికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతోపాటు ప్ర‌సాదాలు అందించ‌డం జ‌రుగుతుందని స్పష్టం చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్త‌మాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమ‌తించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =