సుమీలో చిక్కుకున్న భారతీయుల కోసం ఐరాసలో భారత్ ఆందోళన.. కారిడార్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రష్యా

Russia-Ukraine War Moscow-Kyiv Agree on Humanitarian Corridor To Allow Civilians Out of Sumy, Moscow-Kyiv Agree on Humanitarian Corridor To Allow Civilians Out of Sumy, Moscow-Kyiv, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

తూర్పు ఉక్రెయిన్ నగరమైన సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న పౌరుల తరలింపునకు రష్యా ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ప్రకటించటమే కాకుండా మానవతా కారిడార్స్ ఏర్పాటు చేస్తోంది. అయితే, భారతీయుల కోసం సురక్షితమైన కారిడార్ ఏర్పాటు చేయవలసిందిగా రష్యా మరియు ఉక్రెయిన్ రెండింటికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదని ఐరాసలో భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడినట్లు ఐరాసలో భారతదేశ ప్రతినిధి తెలిపారు. అలాగే, ఇరు దేశాల ప్రజల హితం కోసం శత్రుత్వాన్ని రెండు దేశాలకు ముగించాలని భారతదేశం పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ‘సుమీ’ కూడా ఒకటి. ఇక్కడ భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో తమ చదువుని కొనసాగిస్తున్నారు.

‘మానవతా కారిడార్’ ఏర్పాటుపై రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఉక్రేనియన్ నగరమైన ‘సుమీ’ నుంచి పౌరులు వెలుపలకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్‌చుక్ చెప్పారు. ఇలా వలస పోతున్న వారిలో మొదటి బ్యాచ్ ‘సుమీ’ నగరం నుండి ఉదయం బయలుదేరారని తెలిపారు. సైన్యం ఏర్పాటు చేసిన కాన్వాయ్‌ను స్థానిక ప్రజలు వారి వ్యక్తిగత వాహనాల్లో అనుసరిస్తారు అని వెల్లడించారు. చెర్నియాఖివ్, ఖార్కివ్, కైవ్ మరియు మారియుపోల్ నుండి కూడా మానవతా కారిడార్‌లను ప్రారంభించినట్లు రష్యా తెలిపింది. యుద్ధం ప్రారంభమైన దగ్గరనుంచి ఇప్పటివరకు సుమారు 2 మిలియన్ల మంది వరకు ఉక్రెయిన్ నుంచి వలస పోయారని అంతర్జాతీయ మీడియా అంచనా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 13 =