రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

TDP Chief Chandrababu to Tour in Kuppam From May 11 to 13th, Chandrababu to Tour in Kuppam From May 11 to 13th, TDP President Chandrababu to Tour in Kuppam From May 11 to 13th, Chandrababu to tour kuppam, Chandrababu three days Kuppam tour, TDP chief Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, TDP President Nara Chandrababu Naidu, TDP President Chandrababu, Chandrababu Naidu, TDP national president Nara Chandrababu Naidu, Chandrababu Naidu Kuppam Tour, Nara Chandrababu Naidu three days Kuppam Tour, Chandrababu Naidu Kuppam Tour News, Chandrababu Naidu Kuppam Tour Latest News, Chandrababu Naidu Kuppam Tour Latest Updates, Chandrababu Naidu Kuppam Tour Live Updates, Mango News, Mango News Telugu,

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపటి (మే 11, బుధవారం) నుంచి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో బాదుడే బాదుడు సహా పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. కుప్పంతో పాటు శాంతిపురం, గుడుపల్లె మండలాలలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముందుగా బుధవారం మద్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు బోయనపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు.

అలాగే మే 12, గురువారం ఉదయం శీగలపల్లి దేవాలయాన్ని చంద్రబాబు దర్శించుకుంటారు. అనంతరం గుడిపల్లె మండల పరిధిలోని పలు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక మే 13, శుక్రవారం నాడు కుప్పంలో స్థానిక పార్టీ నేతలు, ఇంచార్జులు, బూత్‌ కన్వీనర్లు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అవుతారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =