టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : వెంకయ్య నాయుడు

AP CM Jagan pays tributes to first Andhra CM Tanguturi, CM Jagan Pays Tribute to Tanguturi Prakasam Pantulu, CM Jagan Pays Tribute to Tanguturi Prakasam Pantulu On his Birth Anniversary, Mango News, ongole, Prakasam Pantulu 150th birth anniversary, Tanguturi Prakasam Pantulu, Tanguturi Prakasam Pantulu Birth Anniversary, Tanguturi Prakasam Pantulu birth anniversary celebrated, Tanguturi Prakasam Pantulu remembered, Tanguturi remembered on birth anniversary, Tributes paid to Prakasam Pantulu, Venkaiah Naidu, Venkaiah Naidu Pays Tribute to Tanguturi Prakasam Pantulu, Vice President, Vice President Venkaiah Naidu

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. నిష్కర్షగా, నిక్కచ్చిగా మాట్లాడే ప్రకాశం పంతులు జీవితం కటిక పేదరికం నుంచి ప్రారంభమైనా, పట్టుదలతో బారిస్టర్ చదివి, పుష్కలంగా ధనార్జన చేసి,స్వాతంత్య్ర ఉద్యమంలో యావదాస్తిని ప్రజల కోసం ఖర్చు చేశారని చెప్పారు. తెలుగు ప్రజల ఆప్త బంధువుగా పేరు గాంచిన వారి జీవితం స్ఫూర్తిదాయకమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

“తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కేస‌రి ప్రకాశం పంతులు గారి 150వ జ‌యంతి సంద‌ర్భంగా వారికి ఘన నివాళి” అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే క్యాంప్‌ కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటం ముందు పూలు ఉంచి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =