టీడీపీ గూటికి వైసీపీ ఏమైల్యే అవంతి శ్రీనివాస్?

What is Avanti Srinivas of YCP to TDP,What is Avanti Srinivas,Avanti Srinivas of YCP to TDP,YCP to TDP,Mango News,Mango News Telugu,TDP,Avanti Srinivas , Bhimili Constituency, Pawan Kalyan, YCP , Panchkarla Ramesh , Pawan , TDP Leader Welcomes YSRCP,Avanti Srinivas to TDP,Avanti Srinivas of YCP Latest News,Avanti Srinivas of YCP Latest Updates,Avanti Srinivas of YCP Live News,Bhimili Constituency Latest News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
TDP,Avanti Srinivas , Bhimili Constituency, Pawan Kalyan, YCP , Panchkarla Ramesh , Pawan , Avanti Srinivas to TDP

ఎన్నికల వేళ పార్టీల మార్పులు, కండువాలు మార్చుకోవడాలు కామనే. అయితే ఒక్కోసారి ఏ మాత్రం ఊహించని పరిణామాలతో పార్టీ పెద్దలే ఉలిక్కిపడేలా రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. అప్పటి వరకూ తమ వాడే అనుకున్నవాడు కాస్తా అవతలి పార్టీలో చేరిపోయి సొంతపార్టీ నేతలకు ఝలక్  ఇస్తుంటారు. ఇంకొందరు ఛా నేను మార్టీ మారడం ఏంటని కొట్టిపడేస్తూ ఆఖరి నిమిషంలో జంప్ అయ్యేవాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులో వైసీపీ నేత  అవంతి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలో  ముఖ్య నేతలుగా కొనసాగిన ఎంతో మంది .. సరిగ్గా 2019 ఎన్నికల సమయం లో ఒకరి తర్వాత ఒకరు వైసీపీలోకి చేరి టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అలా చేసిన ముఖ్య నేతల్లోల అవంతి శ్రీనివాస్  ఒకరు.

2014 ఎన్నికలలో అవంతి శ్రీనివాస్ తెలుగు దేశం పార్టీ తరుపున  నిలబడి గెలుపొందారు. పార్టీలో ముఖ్యమైన పదవులు చేపట్టారు. అయితే  2019 ఎన్నికలలో వైసీపీ గాలి వీస్తుందని.. టీడీపీ ఓడిపోతుందనే సర్వేల లెక్కలతో.. జగన్ పంచన చేరి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన లెక్కలకు తగ్గట్టే  2019 ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేసి గెలుపొందారు కూడా . అయితే టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేసేవారో, వైసీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీపై కూడా అలాగే నెగటివ్ కామెంట్స్ చేయడంలో అవంతి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.

అయితే అలాంటి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ సైకిల్ ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తున్నారన్న టాక్ ఉత్తరాంధ్రలో ఫుల్‌గా వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లలో వైసీపీ పార్టీపై   విపరీతమై అసంతృప్తి ఉంది. ముఖ్యంగా  ప్రభుత్వ ఉద్యోగులు జగన్ పేరెత్తితేనే మండిపడుతున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం మాట అటుంచితే ఉద్యోగులను ముప్పతిప్పలు పెట్టడంలో జగన్ ముందున్నారనే నెగటివిటీ వారిలో బాగా పెరిగిపోయింది. అలాగే విద్యావంతుల్లోనూ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఉచిత పథకాలతో జనాలను సోమరులుగా పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నాలుగున్నరేళ్లు ఉచితాలతోనే  కాలక్షేపం చేసేశారని భావన పెరిగిపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిస్తే వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందంటూ సర్వేలు చెబుతున్నాయి.

దీంతో అందరూ టీడీపీ, జనసేన కూటమి వైపు చూడడం మొదలు పెట్టారు. మరో వైపు సర్వేల లెక్కలతో లెక్కలు మార్చుకుంటారన్న నేమున్న అవంతి శ్రీనివాస్ కూడా.. టీడీపీలోకి రావడానికి ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నట్టు  గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే అవంతి శ్రీనివాస్ ఎప్పటి నుంచో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్‌లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనసేనలో చేరడానికి అవంతి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారని కానీ పవన్ కాస్త వెయిట్ చేయమని చెప్పడంతోనే ఆగుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  పొత్తు ఉంటుంది  కాబట్టి..అవంతి టీడీపీ నుంచి పోటీ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని , కొన్ని రోజులు ఆగండి అని పవన్ చెప్పడంతోనే అవంతి పవన్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారట.

ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో.. ఇప్పుడు ఆ గాలి ఏపీకి కూడా సోకింది. ముందుగానే నేతలంతా తమ తమ  భవిష్యత్ ప్రణాళికల కోసం స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు  అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీలో చేరబోతున్నారని టాక్ జోరందుకుంటంది.  దీని గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.  ఒకవేళ అవంతి శ్రీనివాస్ కనుక టీడీపీలోకి మళ్లీ ఎంట్రీ ఇస్తే.. ఆయనతో పాటు ఉత్తరాంధ్రలో మరికొంత మంది ముఖ్య నేతలు కూడా టీడీపీ ,జనసేన కూటమిలో చేరడానికి రెడీగా ఉన్నారట. ఇప్పటికే వైసీపీ వైజాగ్ ఇంచార్జ్ పంచకర్ల రమేష్ జనసేన పార్టీలో చేరి వైసీపీకి ఝలక్ ఇచ్చారు. అయితే జస్ట్ శాంపిల్ మాత్రమనేనని.. ఇలాంటి షాక్ లు రాబొయ్యే రోజుల్లో వైసీపీకి  మరిన్ని  తగలబోతున్నాయని టాక్ నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =