మే 16న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మొదటివిడత సాయం!, ఒక్కో రైతు ఖాతాలోకి రూ.7500

Andhra Pradesh YSR Rythu Bharosa-PM Kisan Scheme First Installment Funds will Deposit on May 15, Andhra Pradesh YSR Rythu Bharosa First Installment Funds will Deposit on May 15, Andhra Pradesh PM Kisan Scheme First Installment Funds will Deposit on May 15, YSR Rythu Bharosa-PM Kisan Scheme First Installment Funds will Deposit on May 15, PM Kisan Scheme, YSR Rythu Bharosa Scheme, YSR Rythu Bharosa Scheme News, YSR Rythu Bharosa Scheme Latest News, YSR Rythu Bharosa Scheme Latest Updates, YSR Rythu Bharosa Scheme Live Updates, PM Kisan Scheme News, PM Kisan Scheme Latest News, PM Kisan Scheme Latest Updates, PM Kisan Scheme Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత సాయాన్ని మే 16వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ పథకం కోసం ఈ ఏడాది 48.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించగా, వీరిలో 47.86 లక్షల మంది భూయజమానులు కాగా, 91 వేల మంది అటవీ భూ సాగుదారులున్నట్టు తెలుస్తుంది. అర్హులైన రైతుల జాబితాలను మే 6 నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. అలాగే మే 8వ తేదీ వరకు ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటించనున్నారు.

2019-20 సంవత్సరం నుంచి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తుండగా, ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా సాయాన్ని ఏపీ ప్రభుత్వం రైతులకు అందించింది. ఈ సంవత్సరం మొదటి విడతతో భాగంగా రూ.7,500 చొప్పున 48.77 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.3,657.87 కోట్ల నగదును విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.13750 అందిస్తుండగా, మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + three =