ఇకపై ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు ఆన్‌లైన్ లో మైగ్రేషన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

10th Pass Students Can Download Migration Certificate Through Online, AP 10th Migration Certificate, AP 10th Migration Certificate 2022, AP 10th Migration Certificate Download, AP 10th Pass Students, AP 10th Pass Students Can Download Migration Certificate Through Online, AP 10th Pass Students Can Download Migration Certificate Through Online From Now Onwards, Mango News, migration certificate ap 10th class, Online Application for Migration Certification for SSC, SSC students can get migration certificates

ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆగస్టు 6 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్ధిని, విద్యార్ధులు వారిలో ఉన్నత చదువుల కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ ను ఈ సంవత్సరం నుండి ఆన్‌లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ కొరకు ఫీజు కింద రూ.80 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని తెలిపారు.

అదేవిధంగా 2004 నుండి 2020 విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం ఉంటే ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 24 నుండి ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించబడతాయని, www.bse.ap.gov.in వెబ్ సైట్ లో విధి విధానములను అనుసరించి మైగ్రేషన్ సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి ప్రకటనలో తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eight =