సిట్టింగ్‌లకూ చాన్స్ ఇచ్చారు

YCP Third Phase List,YCP List,Third Phase List,YCP 3rd List Postpone,YCP 3rd List Announcement Postponed,YSRCP Third List Released,YSRCP,YCP Sittings,YS Jagan,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy,YSR Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,YCP List Latest Updates
YSRCP, YCP Third Phase List,YCP Sittings,Ys jagan

రెండు జాబితాలను బాగానే రిలీజ్ చేసిన ఏపీ సీఎం జగన్..అసంతృప్త రాగాలు ఎక్కువ అవడంతో మూడో జాబితాకు కాస్త టైమ్ ఎక్కువగానే తీసుకున్నారు. వైనాట్ 175 నినాదంతో జగన్ అభ్యర్థులను ప్రకటించేసి ఇక ఫోకస్ అంతా ఎన్నికల ప్రచారంపై పెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే మూడో విడత లిస్టును ప్రకటించిన వైసీపీ సీఎం జగన్.. విజయవాడ ఇన్‌చార్జిగా నానిని నియమించారు.

రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా .. అధినేత జగన్  వైసీపీలో కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. అసంతృప్తులు పెరిగినా డోంట్ కేర్ అంటూ గెలుపు గుర్రాలకే టికెట్ల ఇవ్వనున్నట్లు ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే అభ్యర్థులలో భారీ మార్పులు చేస్తూ రెండుసార్లు జాబితా రిలీజ్ చేసిన జగన్.. తాజాగా 21 మందితో థర్డ్ లిస్టును  రిలీజ్ చేసింది. ఇందులో ఆరుగురు ఎంపీ స్థానాలకు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేండిడేట్స్‌‌ను  ప్రకటించింది.

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇప్పుడు టికెట్ వచ్చినవారంతా తప్పకుండా విజయం సాధించాల్సిందేనని జగన్ ఆదేశించారు. ముందు నుంచీ కూడా సిట్టింగ్‌ స్థానాల్లో బలహీనంగా ఉంటే.. నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు అవసరమవుతాయని చెబుతూనే వస్తున్నారు. ఈ మార్పులకు సిట్టింగులు, ఆశావహులు సహకరించాలని చెప్పిన  జగన్‌.. రాబోయే రోజుల్లో వారందరికీ గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంను క్షుణ్ణంగా పరిశీలించిన జగన్ క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల బలాబలాలు.. సామాజిక సమీకరణాలను, గెలిచే అవకాశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని  మూడో జాబితాను రూపొందించారు.దీనికోసం పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ మూడో జాబితాను గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయగా..ఈ జాబితాలో కొంతమంది సిట్టింగ్‌లో చోటు దక్కించుకున్నారు.

పార్లమెంట్‌ ఇన్‌చార్జీలు..

శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక

విశాఖపట్నం (ఎంపీ) – బొత్స ఝాన్సీ లక్ష్మి

ఏలూరు (ఎంపీ) – కాకుమూరి సునీల్‌ యాదవ్‌

విజయవాడ (ఎంపీ) – కేశినేని నాని

కర్నూలు (ఎంపీ) – గుమ్మునూరి జయరాం

తిరుపతి (ఎంపీ) – కోనేటి ఆదిమూలం

అసెంబ్లీ ఇన్‌చార్జీలు..

చిత్తూరు – విజయానందరెడ్డి

మదనపల్లె- నిస్సార్‌ అహ్మద్‌

రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

ఆలూరు – బూసినే విరూపాక్షి

కొడుమూరు (ఎస్సీ) – డాక్టర్‌ సతీశ్‌

ఇచ్చాపురం – పిరియా విజయ

టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌

చింతలపూడి (ఎస్సీ)- కంభం విజయరాజు

రాయదుర్గం -మెట్టు గోవిందరెడ్డి

దర్శి చూడేపల్లి – శివప్రసాద్‌రెడ్డి

పూతలపట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్‌కుమార్‌

గూడురు ఎస్సీ (ఎస్సీ) -మేరిగ మురళీ

సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి

పెనమలూరు – జోగి రమేశ్‌

పెడన – ఉప్పాల రాము

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =