వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్, అచీవ్‌మెంట్-2022 అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్‌, సీఎం జగన్‌

YSR Lifetime Achievement YSR Achievement-2022 Awards Presentation Ceremony AP Governor CM Jagan Attends, YSR Lifetime Achievement, YSR Achievement-2022 Awards Presentation Ceremony, AP Governor, CM Jagan Attends, Mango News, Mango News Telugu, YSR Achievement-2022 Awards, Biswabhusan Harichandan, Governor of Andhra Pradesh, YSR Lifetime Achievement Awards, Y. S. Rajasekhara Reddy, Former Chief Minister of Andhra Pradesh

విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, సాహిత్యం, మీడియా సహా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఐదు మంది వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్-2022, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్-2022 అవార్డులకు ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు (నవంబర్ 1, మంగళ వారం) విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్ విజయమ్మ, రాష్ట్ర మంత్రులు, అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, సమాజం కోసం శ్రమించిన, శ్రమిస్తున్న మహనీయులందరికి, అవార్డు అందుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలిపారు. “మీ సేవలకు వందనం. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు, అసామాన్య సేవలు అందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది అత్యున్నత వైఎస్ఆర్ అవార్డ్స్ ప్రదానం చేస్తున్నాం” అని సీఎం జగన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ అవార్డులు అందజేస్తున్నామని, ఈ రోజు వైఎస్ఆర్ అవార్డ్స్ అందుకుంటున్న ప్రతి ఒక్కరికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ , సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా మొత్తం 35 మంది వ్యక్తులు, సంస్థలు కలిపి 20 వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్, 10 వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను అందుకున్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, డాక్టర్ వైఎస్‌ఆర్ కాంస్య బొమ్మ, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, డాక్టర్ వైఎస్‌ఆర్ కాంస్య బొమ్మ, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రం ఇవ్వనున్నారు.

వ్యవసాయం రంగంలో వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు:

1. ఆదివాసీ క్యాషు నట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చెందిన సోడెం ముక్కయ్య, బుట్టయ్యగూడెం, ఏలూరు
2. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి చెందిన ఎ.గోపాలకృష్ణ
3. అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలుపుల గ్రామానికి చెందిన జయబ్బ నాయుడు
4. కె.ఎల్.ఎన్.మౌక్తిక, అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, సబ్బవరం, అనకాపల్లి జిల్లా
5. కట్టమంచి బాలకృష్ణ రెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా.

కళలు మరియు సంస్కృతిలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్
2. ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి.

కళలు మరియు సంస్కృతిలో వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు:

1. రంగస్థల కళాకారుడు నాయుడు గోపి
2. కలంకారి క్రూసేడర్ పిచ్చుక శ్రీనివాస్
3. ఉదయగిరికి చెందిన షేక్ గౌసియా బేగం (వుడెన్ కిచెన్ ఇన్స్ట్రుమెంట్స్).

సాహిత్యంలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
2. ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్
3. రచయిత డాక్టర్ శాంతి నారాయణ.

మహిళా సాధికారత మరియు రక్షణలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. ప్రజ్వల ఫౌండేషన్‌కు చెందిన సునీతా కృష్ణన్
2. ఉయ్యూరు శిరీషా (పునరావాస కేంద్రం).

5 గురు దిశ పోలీసు అధికారులకు సంయుక్తంగా వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు: రావాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజత్రయ్య మరియు పి. శ్రీనివాసులు.

విద్యారంగంలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. రిషి వ్యాలీ విద్యా సంస్థ, మదనపల్లి
2. జవహర్ భారతి విద్యా సంస్థ, కావలి
3. వ్యక్తిత్వ వికాస శిక్షకుడు బి.వి.పట్టాభిరామ్.

విద్యారంగంలో వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు:

1. నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డి (వేలాది మంది బ్యాంకు ఉద్యోగాలను ఆశించిన వారికి శిక్షణ).

జర్నలిజంలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. భండారు శ్రీనివాసరావు
2. సతీష్ చంద్ర
3. మంగు రాజగోపాల్
4. ఎంఈవీ ప్రసాద రెడ్డి.

వైద్య మరియు ఆరోగ్యంలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి చెందిన డాక్టర్ బి. నాగేశ్వర రెడ్డి
2. శాంత బయోటెక్ డాక్టర్ వరప్రసాద రెడ్డి
3. భారత్ బయోటెక్‌కి చెందిన డాక్టర్ కృష్ణ యల్లా మరియు సుచిత్ర యల్లా
4. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్
5. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు చెందిన గుళ్లపల్లి నాగేశ్వరరావు.

పారిశ్రామిక రంగంలో వైఎస్ఆర్ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్ అవార్డులు:

1. గ్రంధి మల్లికార్జునరావు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here