యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, నారా లోకేష్ ఆగ్రహం

Tension Prevails in Yuvagalam Padayatra Nara Lokesh Campaign Vehicle Seized by Palamaneru Police,TDP Yuvagalam,Janasena Varahi Programs,Will Not Stop,Nara Lokesh Says in Public Meeting at Kuppam,Mango News,Mango News Telugu,Yuvagalam Padayatra 2 0 Route Map,Yuvagalam Padayatra Route Map,Maha Padayatra,Amravati Maha Padayatra,Yuvagalam Farmers Maha Padayatra,Yuvagalam Farmers Maha Padayatra Route Map,Yuvagalam Maha Padayatra,Jana Sena Chief Pawan Kalyan,Campaign Vehicle Varahi,Varahi Vehicle,Varahi Ready For Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News And Live Updates,Varahi Vehicle at Kondagattu Temple,Special Puja for Varahi Vehicle

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం పలమనేరు నియోజవర్గంలో లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంగా పట్టణ పోలీసులు లోకేష్ లోకేష్ కాన్వాయ్‌లోని ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో పలమనేరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే తమ వాహనాన్ని సీజ్ చేయడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వాహనాన్ని సీజ్ చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై మండిపడ్డ నారా లోకేష్ ప్రచార వాహనం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే దీనిపై పలమనేరు డీఎస్పీ, అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని, అలాగే ప్రసంగంలో మైకును వాడారని తెలియజేశారు. నిబంధనల ప్రకారం అలా చేయడం కుదరదని వివరణ ఇచ్చారు. ఇక లోకేష్ నిరసనతో పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు ప్రచార వాహనాన్ని విడిచిపెట్టారు. దీంతో లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తూ ముందుకు కదిలారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here