విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ: విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర

AP CM YS Jagan, Centre Decision on Privatisation of Visakhapatnam Steel Plant, Mango News, MP Vijayasai Reddy, Plan To March Towards Budget Parliament, Privatisation of Visakhapatnam Steel Plant, privatisation of Vizag Steel Plant, Privatization of Vizag Steel Plant, Protests Against Privatisation, Steel Plant Workers Unions, Steel Plant Workers Unions in Visakhapatnam, Vijayasai Reddy Padayatra Against Privatization of Vizag Steel Plant, Visakhapatnam, Visakhapatnam Steel Plant, Visakhapatnam Steel Plant Criticism, Visakhapatnam Steel Plant Issue, Visakhapatnam Steel Plant News, YSRCP MP Vijayasai Reddy, YSRCP MP Vijayasai Reddy Conducting Padayatra in Vizag

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 20, శనివారం నాడు విశాఖ నగరంలో వైస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. ఈ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాట పాదయాత్ర జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, డైమండ్ పార్క్, దొండపర్తి, మర్రిపాలెం, ఎన్ఏడీ జంక్షన్, ఎయిర్ పోర్ట్, షీలానగర్, బీహెచ్‌పీవీ, పాత గాజువాక మీదుగా కూర్మన్నపాలెం ఉక్కు పరిశ్రమ ప్రధాన ఆర్చ్ వరకు కొనసాగనుంది. దాదాపుగా 25 కిలోమీటర్లు ఈ పాదయాత్రను చేపట్టనున్నారు. పాదయాత్ర అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. కాగా ఈ పాదయాత్రలో విజయసాయిరెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైస్సార్సీపీకి చెందిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి, కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ‌ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంతో పాటుగా, ఈ అంశంపై పార్లమెంట్ ‌లో కూడా పోరాటం చేస్తామని వెల్లడించారు. మరోవైపు విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కుపరిశ్రమ ఆర్చ్ వద్ద ఉక్కుపరిశ్రమ పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =