నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ప్లీనరీలో పాల్గొనడంలో తప్పేముంది? – స్పీకర్ తమ్మినేని సీతారాం

YSRCP Plenary 2022 AP Assembly Speaker Tammineni Sitaram Responds Over Allegations on Attending Plenary, AP Assembly Speaker Responds Over Allegations on Attending Plenary, AP Assembly Speaker Tammineni Sitaram Responds Over Allegations on Attending Plenary, Tammineni Sitaram Responds Over Allegations on Attending Plenary, Allegations on Attending Plenary, AP Assembly Speaker Tammineni Sitaram, Assembly Speaker Tammineni Sitaram, AP Assembly Speaker, Tammineni Sitaram, Allegations, YSRCP Plenary 2022 Begins at Guntur Party will Introduce Five Resolutions on First Day, YSRCP Plenary-2022 Day 1 CM YS Jagan Starts The Plenary After Hosting of Party Flag at Guntur, CM YS Jagan Starts The Plenary After Hosting of Party Flag at Guntur, YSRCP Plenary-2022, 2022 YSRCP Plenary, YSRCP Plenary to be Held on July 8 9 at Guntur Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held on July 8 And 9 at Guntur, YSRCP Plenary to be Held at Guntur, Guntur YSRCP Plenary, YSRCP Plenary, YSRCP plenary at Guntur, YSR Congress Party, YSRCP plenary at Guntur News, YSRCP plenary at Guntur Latest News, YSRCP plenary at Guntur Latest Updates, YSRCP plenary at Guntur Live Updates, Mango News, Mango News Telugu,

నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, పార్టీ ప్లీనరీలో పాల్గొనడంలో తప్పేముందని ప్రశ్నించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మేరకు ఆయన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. ప్లీనరీ రెండవ రోజైన శనివారం పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై జరిగిన చర్చలో మొదటగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిందని, ఈ మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్‌ నామస్మరణే వినిపిస్తోందని తమ్మినేని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యం అని, దానికి ఇప్పటినుంచే మనం కథనరంగంలోకి దిగి కార్యోన్ముఖులం కావాలని పార్టీ శ్రేణులకు తమ్మినేని పిలుపునిచ్చారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని, మరో 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని సీతారాం తెలిపారు.

స్పీకర్ ప్లీనరీకి వచ్చారని.. రాజకీయ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఒక వార్తా పత్రికలో వచ్చిన కథనంపై సీతారాం స్పందిస్తూ.. నేను ముందు వైసీపీలో ప్రాథమిక సభ్యుడినని, ఆ తరువాతే ఎమ్మెల్యే నైనా, శాసనసభాపతినైనా అని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఇక్కడ పార్టీ ప్లీనరీ పండుగ జరుగుతుంటే, రాకుండా ఇంట్లోనే కూర్చోవాలా? అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ మహానాడులో అప్పుడు స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్‌ పాల్గొనలేదా? ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? ఆయన ప్లీనరీకి హాజరవగా లేనిది నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పెలా అవుతుందని తమ్మినేని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 14 =