అవసరం అయితే స్థానాలు మార్చుకుంటామన్న పవన్

Pawan Kalyan Announced Kakinada MP Candidate, Kakinada MP Candidate Announced, MP Candidate Kakinada Announced, TDP, Janasena, YCP, Congress, BJP, Pawan Kalyan, Kakinada MP candidate, Latest Kakinada News, Kakinada Politics, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP, Janasena, YCP, Congress, BJP, Pawan Kalyan, Kakinada MP candidate,

కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగానూ కూడా బరిలోకి దిగుతారన్న వార్తలకు ఆయన చెక్ పెట్టేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. కాకినాడ పార్లమెంట్  ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును  ప్రకటించారు. పిఠాపురం అసెంబ్లీ సీటును ఉదయ్ తన కోసం త్యాగం చేశారని..అందుకే ఆయనకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే, భవిష్యత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనను ఎంపీగా పోటీ చేయమని సూచిస్తే.. కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాన్నారు. అప్పుడు తాను, ఉదయ్ తమతమ స్థానాలు మార్చుకుంటామని క్లారిటీ ఇచ్చారు.

కాకినాడ ఎంపీగా తాను పోటీ చేస్తే.. పిఠాపురం నుంచి ఉదయ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పవన్ స్పష్టం చేశారు. ఈ రెండు స్థానాలు జనసేనకు ఎంతో కీలకమని చెప్పారు. అసలు జనసేన లేకపోతే అసలు పొత్తులే లేవని.. టీడీపీ, జనసేనతో పొత్తు కోసం..బీజేపీ అధిష్టానాన్ని తానే ఒప్పించానని  కూటమిలో తన పాత్రను వివరించారు.  పొత్తులో భాగంగా జనసేనకు ఇప్పుడు దక్కని 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేనను గెలిపిస్తే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని అన్నారు. గెలవడం అంటే గెలవడం కాదని..జనసేన అభ్యర్థులకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని ..కాకినాడ పార్లమెంట్ దద్దరిల్లాలని జనసైనికులకు పిలుపునిచ్చారు..

రానున్న ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో  జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి.  ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ఫిక్స్ చేసిన జనసేనాని.. మిగిలిన స్థానాల అభ్యర్థులను త్వరలోనే ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. ఇక జనసేనకు కేటాయించిన 2 పార్లమెంట్ స్థానాల్లో తాజాగా వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎంపీ బాలశౌరికి  మచిలీ పట్నం సీటును  కేటాయించారు. ఇప్పుడు రెండో ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ ను ప్రకటించడంతో  జనసేన పోటీ చేసే రెండు పార్లమెంట్ స్థానాలు ఏవి అన్న ఉత్కంఠకు తెరపడినట్లు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =