వైఎస్సార్‌సీపీ ప్లీనరీ: వైఎస్‌ విజయమ్మ కీలక నిర్ణయం, పార్టీ ‘గౌరవ అధ్యక్షురాలు’ పదవికి రాజీనామా

YSRCP Plenary YS Vijayamma Resigns For The Post of Honorary Party President, YS Vijayamma Resigns For The Post of Honorary Party President, Vijayamma Resigns For The Post of Honorary Party President, YSRCP Honorary Party President, Honorary Party President, YS Vijayamma YSRCP Honorary Party President, YSRCP To Hold 2 Day Plenary Meeting On Birth Anniversary Of YS Rajashekar Reddy, YSRCP Plenary 2022 Begins at Guntur Party will Introduce Five Resolutions on First Day, YSRCP Plenary-2022 Day 1 CM YS Jagan Starts The Plenary After Hosting of Party Flag at Guntur, CM YS Jagan Starts The Plenary After Hosting of Party Flag at Guntur, YSRCP Plenary-2022, 2022 YSRCP Plenary, YSRCP Plenary to be Held on July 8 9 at Guntur Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held on July 8 And 9 at Guntur, YSRCP Plenary to be Held at Guntur, Guntur YSRCP Plenary, YSRCP Plenary, YSRCP plenary at Guntur, YSR Congress Party, YSRCP plenary at Guntur News, YSRCP plenary at Guntur Latest News, YSRCP plenary at Guntur Latest Updates, YSRCP plenary at Guntur Live Updates, Mango News, Mango News Telugu,

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదికగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. పార్టీ ‘గౌరవ అధ్యక్షురాలు’ పదవికి రాజీనామా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్‌లో తనపై విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఇటు ఏపీలో కొడుకు సీఎం జగన్‌, అటు తెలంగాణలో కూతురు షర్మిల వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. తనకు ఇద్దరు బిడ్డలు సమానమని, అయితే ముందుగా తెలంగాణలో ఎన్నికలు రానున్నందున షర్మిలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రెండు పార్టీలలో పదవులు చేపట్టడం కరెక్ట్ కాదని, అందుకే తాను ఈ కఠిన నిర్ణయానికి వచ్చానని తెలిపారు. వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానని విజయమ్మ స్పష్టం చేశారు.

ఈ నిర్ణయాన్ని మీరందరూ అర్ధం చేసుకోవాలని, నా బిడ్డలిద్దరికీ మీ అందరి మద్దతు కావాలని విజయమ్మ ఆకాంక్షించారు. ఏపీలో తన అన్న జగన్‌కు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేసిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఒంటరిగా పోరాడుతోందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది, అందుకే నేను అక్కడ తనకు అండగా ఉండాలని అనుకుంటున్నాని వెల్లడించారు. ఇక వైఎస్సార్‌ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరని, అయితే ప్రజలకు ఆ లోటు తీర్చడానికి నా ఇద్దరు బిడ్డలు ఉన్నారని విజయమ్మ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఊహించలేదని, తన నిర్ణయం ఒకవేళ వైసీపీ అభిమానులను బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని విజయమ్మ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 2 =