కాకతీయ వైభవ సప్తాహం: కాకతీయుల విశిష్టత, వైభవాన్ని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Kakatiya Sapthaham Celebrations Minister KTR Inaugurates Kakatiya Vaibhavam Photo Exhibition, Minister KTR Inaugurates Kakatiya Vaibhavam Photo Exhibition, Telangana Minister KTR Inaugurates Kakatiya Vaibhavam Photo Exhibition, KTR Inaugurates Kakatiya Vaibhavam Photo Exhibition, Telangana Minister KTR Inaugurated Kakatiya Vaibhavam Photo Exhibition, KTR Launches Kakatiya Vaibhavam Photo Exhibition, Kakatiya Vaibhavam Photo Exhibition, Kakatiya Sapthaham Celebrations, Kakatiya Sapthaham, Kakatiya Sapthaham Celebrations News, Kakatiya Sapthaham Celebrations Latest News, Kakatiya Sapthaham Celebrations Latest Updates, Kakatiya Sapthaham Celebrations Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు జూలై 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వారం రోజుల పాటుగా ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వేడుకల్లో భాగంగా కాకతీయుల విశిష్టతను తెలిపేలా మాదాపూర్‌ లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కాకతీయుల 22వ వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ తో కలిసి మంత్రులు మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం నాడు ప్రారంభించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో కాకతీయుల వైభవాన్ని తెలిపే 777 చిత్రాలను ఉంచారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి, మానవీయ స్ఫూర్తికి మారుపేరుగా నిలిచిన కాకతీయ పాలకులను ఇప్పటికీ తెలంగాణ సమాజం గర్వంగా తలుచుకుంటుందని అన్నారు. కాకతీయుల స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ పేరుతో రాష్ట్రంలోని చెరువుల పునురుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని మంత్రి తెలిపారు. చీఫ్ విప్ దాస్యం విన‌య్‌ భాస్క‌ర్‌ ఈ కార్య‌క్ర‌మం గురించి చెప్ప‌గానే ప్రభుత్వం తరపునే అన్ని ఏర్పాట్లు చేసి ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఒక సమావేశం చేసుకుని హైదరాబాద్, వరంగల్, రామప్ప టెంపుల్ వద్ద వారం రోజుల పాటుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ఆలోచన చేసి, అందరిని భాగస్వామ్యులు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు

మరోవైపు ఘనంగా జరుగుతున్న కాకతీయ వైభవ సప్తాహంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్‌ లను ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందించారు. కాకతీయ సప్తాహం వేడుకలు గొప్పగా ప్రారంభించారని కొనియాడారు. 700 సంవత్సరాల కాకతీయ రాజులు వారి సేవలను మరియు మన గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని కూడా ఈ వారం రోజుల వేడుకలు గుర్తుచేస్తాయని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 15 =