అదిరిపోయే ఆఫర్‌ కొట్టిన నిధి అగర్వాల్‌.. వేణుస్వామికి, నిధి ఆఫర్‌కి లింకేంటి?

Actress Nidhi Agarwal Gets Overwhelming Offer After Pays Special Puja with Astrologer Venu Swamy,Actress Nidhi Agarwal Gets Overwhelming Offer,Nidhi Agarwal After Pays Special Puja with Astrologer,Special Puja with Astrologer Venu Swamy,Mango News,Mango News Telugu,Venuswami, Nidhi Agarwal, Nidhi Agarwal offer, Nidhi's offer,Offer opposite Prabhas,Actress Nidhi Agarwal Latest News,Actress Nidhi Agarwal Latest Updates,Actress Nidhi Agarwal Live News,Astrologer Venu Swamy Latest News

వేణుస్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా సెలబ్రిటీలకు, రాజకీయ సెలబ్రిటీలకు జాతకం చెబుతూ ఉంటారు. వారికి జాతకాలు చెప్పి చెప్పి.. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. కొన్ని నిజం కావడంతో ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు. మొదట రష్మికతో పూజలు చేయించగా టాప్ హీరోయిన్ అయిపోవడమేకాదు.. నేషనల్ క్రష్‌గా మారిపోయింది.

సమంత-నాగచైతన్య కాపురం నిలవదు.. విడాకులు తీసుకుంటారంటూ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే వీరిద్దరూ విడిపోవడమే వేణుస్వామి ఫేమస్ అవడానికి కారణమైంది. రష్మిక స్టార్ హీరోయిన్ అయినప్పుడు యావరేజ్‌గా పేరు తెచ్చుకున్న వేణుస్వామి సమంత-నాగచైతన్య విడాకుల విషయం చెప్పి సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత నిధి అగర్వాల్‌తో కూడా పూజలు చేయించారు. ఐతే.. ఆమెకు మాత్రం అనుకున్నంత ఆఫర్స్‌ ఏవీ రాలేదు. దీంతో వేణుస్వామి చేసిన పూజలు ఫలించలేదా..? ఆయన చెప్పినవన్నీ ఉత్తుత్తి మాటలేనా..? అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయితే తాజాగా నిధి అగర్వాల్ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు వార్త వైరల్ అవుతోంది.

ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అందుకు తగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. పవన్ కల్యాణ్ సరసన అదిరిపోయే ఆఫర్ అందుకుంది. హరిహరవీరమల్లు సినిమాకు నిధి అగర్వాలే హీరోయిన్. అయితే ఆ చిత్రం 2020 నుంచి పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది. ఏఎం రత్నం నిర్మాత కాగా, క్రిష్ దర్శకుడు. తాజాగా ప్రభాస్ సరసన ఆఫర్ అందుకోవడంతో వేణుస్వామి పూజలు ఫలించాయని తెలుగు సినీ పరిశ్రమలో టాక్ వినపడుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here