బిగ్ బాస్-3: వితికా ఎలిమినేట్, ఏడ్చేసిన వరుణ్ సందేశ్

Bigg Boss Season 3 Telugu Updates, Bigg Boss Telugu 3 Updates, Bigg Boss Telugu 3 Updates Vithika Sheru Eliminated From Show, Bigg Boss Telugu Season 3 Updates, Bigg Boss Telugu Season 3 Weekend Episode, Bigg Boss Telugu Season 3 Weekend Episode Highlights, Highlights Of Bigg Boss Telugu Season 3, Mango News Telugu, Vithika Sheru Eliminated, Vithika Sheru Eliminated From Bigg Boss Telugu 3

జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ విజయవంతంగా 92 రోజులు పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 20, ఆదివారం నాడు జరిగిన 92వ ఎపిసోడ్ లో నటి, హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో బిగ్ బాస్ ఇంటిలో ఉన్న ఏడుగురు నామినేట్ అవ్వగా, శనివారం ఎపిసోడ్లో వారి కుటుంబసభ్యులతో గేమ్ ఆడించి శ్రీముఖీ, బాబా భాస్కర్, రాహుల్ సేఫ్ అయినట్టుగా ప్రకటించారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లోనే మిగిలిన వరుణ్ సందేశ్, వితికా, శివజ్యోతి, అలీ రేజాలలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందినా వితికా ఎలిమినేట్ అయినట్టుగా వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు.

ఈ బిగ్ బాస్ సీజన్లో తొలిసారిగా బార్యాభర్తలైన వరుణ్ సందేశ్, వితికా షెరు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీజన్ మొదలైనప్పటినుంచి హౌజ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, 91 రోజులపాటు ప్రేక్షకులను అలరించారు. వితికా ఇంటి నుంచి వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ ఏడ్చేశాడు, స్టేజ్ మీదకు వచ్చిన వితికా ఇంటిలో తన 91 రోజుల ప్రయాణాన్ని చూసి సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఇంటి సభ్యులపై బిగ్ బాంబ్ వేయాలంటూ నాగార్జున కోరగా, వితికా రాహుల్ ని ఎంచుకుంది. బిగ్ బాంబ్ శిక్ష కింద మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంతవరకు ఇంట్లోని బాత్ రూంలను రాహుల్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, శిల్ఫా చక్రవర్తి, హిమజ , రవికృష్ణ, పునర్నవి. మహేష్ విట్టా, వితికా ఎలిమినేట్ అవ్వడంతో ఇంటిలో ఇంకా 6 గురు సభ్యులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 13 =