మన్మథుడు 2 ఆగస్ట్ 9 న విడుదల

Manmadhudu 2 Will Release On August 9,Mango News,2019 Latest Telugu Movie News, Manmadhudu 2 Movie Details, Manmadhudu 2 Movie Release Date, Manmadhudu 2 Release Date, Manmadhudu 2 Telugu Movie Release Date, Manmadhudu 2 Telugu Movie Updates, Nagarjuna Manmadhudu 2 Movie release date

అక్కినేని నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయినుగా, నటిస్తున్న చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, షూటింగ్ పూర్తిచేసుకొని, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్ర బృందం ఈ రోజు విడుదల తేదీని ప్రకటిస్తూ , కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా రూపొందిన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 9 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన చిత్ర టీజర్, మీట్ అవంతిక టీజర్ లు అభిమానుల నుండి విశేషమైన స్పందనను రాబట్టుకున్నాయి.

ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మీ,కీర్తి సురేష్,వెన్నెల కిషోర్,ఝాన్సీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అంతే గాక వరుసవిజయాలు సాధిస్తూ , విజయపధంలో దూసుకెళ్తున్న అక్కినేని కోడలు సమంత కీలకమైన అతిధి పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియోని త్వరలోనే ఘనంగా విడుదల చేయనున్నారు. నాగార్జున కెరీర్ లో మన్మథుడు చిత్రం, ఘనవిజయం సాధించి క్లాసిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే, ఇప్పుడు అభిమానులు మళ్ళీ ఈ మన్మథుడు 2 చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=XlZBUz61gzg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 8 =