తెలంగాణలో కోవిడ్-19 మరణాలకు సంబంధించి ఎక్స్-గ్రేషియాకై దరఖాస్తులు

COVID 19 Deaths, covid 19 exgratia, Covid-19 Ex-gratia, Covid-19 Ex-gratia In AP, Disaster Management Dept, Mango News, Mango News Telugu, Telangana Disaster Management Department, Telangana Disaster Management Dept, Telangana Disaster Management Dept Invites Applications From Kin of COVID-19 Deaths for Ex-Gratia, Telangana govt invites applications from kin of COVID-19, Telangana govt invites applications from kin of COVID-19 deaths

రాష్ట్రంలో కోవిడ్-19తో మృతిచెందిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలను ఎక్స్-గ్రేషియాగా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ఎక్స్-గ్రేషియా పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణ శాఖ తెలియచేసింది. ఈ మేరకు మంగళవారం విపత్తుల నివారణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్-19తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని 4500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఈ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచి మీ సేవా కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కోవిడ్ డెత్ నిర్దారణ కమిటీ కోవిడ్-19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని, దీని అనంతరం ఎక్స్-గ్రేషియా మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040-48560012 అనే నెంబర్ కు గానీ, [email protected] అనే మెయిల్ కు సంప్రదించాలని విపత్తుల నివారణ శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =