సాహో మూవీ రివ్యూ

Latest Telugu Movies Review And Rating, Mango News Telugu, Prabhas And Shraddha Kapoor Saaho Movie, Prabhas Saaho Movie Review, Prabhas Saaho Review Live Updates, Saaho Movie Public Opinion, Saaho Movie Public Talk, Saaho Movie Review, Saaho Movie Story, Saaho Review, Saaho Review And Rating, Saaho Telugu Movie Plus Points, Saaho Telugu Movie Public Response, Saaho Telugu Movie Review, Telugu Movies News 2019

బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ‘ సాహో ‘. బాహుబలితో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ప్రేక్షకులు కూడ ఎంతగానో ఎదురుచూసారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ అంచనాలను ఆసాంతం పెంచేసాయి. ట్రైలర్ లో విజువల్స్ హాలీవుడ్ సినిమాలను తలపించించేలా ఉండడంతో ఒక్కసారిగా ఎక్కడ చూసిన సాహో మానియా మొదలయింది. ప్రభాస్ దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించి, సాహో నిర్మాణ విషయాలను పంచుకున్నాడు. భారీ బడ్జెట్ తో, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీష్రాఫ్, చంకీ పాండే, మందిరాబేడి, అరుణ్ విజయ్ ఇతరులు నటించగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడే విడుదల అయ్యింది.

ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుంది. ఎమోషనల్ టచ్ తో, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఉర్రుతాలూగించింది. అద్భుతమైన నిర్మాణ విలువలతో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన నటనతో మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాలు, చేజ్ లలో ప్రభాస్ పడిన కష్టం తెలుస్తుంది. అబుదాబిలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఊహించని విధంగా ఉంటాయి, సినిమా ఆసాంతం తన స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రభాస్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన పెర్ఫార్మన్స్, గ్లామర్ తో అలరించింది. యాక్షన్ సన్నివేశాలలో సైతం అలవోకగా చేసి మెప్పించింది. మిగిలిన తారాగణం వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విభాగంలో ఈ సినిమా హాలీవుడ్ స్థాయిని తలపించింది. సినిమాటోగ్రాఫర్ ఆర్. మాది మంచి ప్రతిభ కనపరిచాడు. పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. యువీ క్రియేషన్స్ అత్యధిక బడ్జెట్ తో, ఆశ్చర్యపరిచే నిర్మాణ విలువలతో సినిమా తీశారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. ఇక దర్శకుడు సుజీత్ తను ఎంచుకున్న కధకి, ఊహించని స్క్రీన్ ప్లే జతచేసి తన సత్తా నిరూపించుకున్నాడు. తన రెండో సినిమాకే ఈ స్థాయి సినిమాతో మ్యాజిక్ చేసాడు. ఎక్కడా తడబడకుండా ఎంచుకున్న కధని వినూత్న పంధాలో తీసి అభిమానుల అంచనాలను అందుకున్నాడు. అన్ని అంశాలున్నా సాహో చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.యాక్షన్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు పండగలా ఉంటుంది. ఈ చిత్రం సంచలన విజయం సాధించి కొత్త రికార్డులను సృష్టించి, బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here