ఆస్కార్‌ అవార్డ్ రేసులో జూ. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను అవకాశం?

Star Actor Jr NTR Among Variety’s Oscars Best Actor Prediction List for Komuram Bheem Role in RRR Movie, RRR star Jr NTR gets included in Oscars 2023 prediction list, Oscars 2023 prediction list, Oscars Best Actor Prediction List, Komuram Bheem Role in RRR Movie, RRR Movie, Star Actor Jr NTR, Oscar Best Actor predictions, Komuram Bheem, Oscars 2023 prediction list News, Oscars 2023 prediction list Latest News And Updates, Oscars 2023 prediction list Live Updates, Mango News, Mango News Telugu,

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన జూ.ఎన్టీఆర్‌ ప్రముఖ ‘ఆస్కార్‌ అవార్డ్’ బరిలో ఉన్నాడా? దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటనకు గాను ఆయన ఆస్కార్‌ అవార్డ్ రేసులో నిలిచాడా? గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. కాగా ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పలు రికార్డులను సాధించింది. దీనిలో జూ. ఎన్టీఆర్‌ కొమురం భీంగా, మరో అగ్ర హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా విజృంభించి నటించారు. దేశవ్యాప్తంగా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదలై విదేశాల్లోని ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరయింది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంశలు దక్కాయి.

ఇందులో ‘కొమురం భీమ్‌’ పాత్రలో జూ. ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో పాన్‌ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ క్రమంలో అమెరికాలో పేరొందిన ‘వెరైటీ’ అనే వెబ్ సైట్ లో 2023 ఆస్కార్‌ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్-ప్రెడిక్షన్ జాబితాను ప్రచురించారు. ఆ జాబితా ప్రకారం 2023 ఆస్కార్‌ బరిలో జూ.ఎన్టీఆర్‌ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వెరైటీ వెబ్ సైట్ ప్రకటించిన అన్ ర్యాంక్డ్ పాజిబుల్ కంటెండర్స్ (బెస్ట్ యాక్టర్) ప్రిడిక్షన్స్ జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం పాత్రకు గానూ జూ.ఎన్టీఆర్‌ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ వార్తతో ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఒకవేళ ఇది నిజమై జూ.ఎన్టీఆర్‌ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డుకు నామినేషన్స్ లో ఉంటే, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ గౌరవాన్ని అందుకునే తొలి నటుడిగా జూ.ఎన్టీఆర్‌ నిలవనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =