బీజేపీ కీలక ప్రకటన, కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు, జాబితా ఇదే…

BJP Announces New Parliamentary Board and New Central Election Committee, BJP Announces New Central Election Committee, BJP Announces New Parliamentary Board, New Central Election Committee, New Parliamentary Board, BJP announces new 11-member Parliamentary Board, BJP constitutes its new Parliamentary Board and Central Election Committee, new Parliamentary Panel, Bharatiya Janata Party, BJP New Parliamentary Board News, BJP New Parliamentary Board Latest News And Updates, BJP New Parliamentary Board Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 11 మంది సభ్యులతో కూడిన బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరో ఏడుగురు సభ్యులు ఉన్నారు. గత పార్లమెంటరీ బోర్డులో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను తాజా పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కలేదు. కొత్తగా బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె.లక్ష్మణ్, సుధా యాదవ్, బిఎల్ సంతోష్, సత్యనారాయణ జాతియా, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా వంటి వారికీ చోటు దక్కింది.

ఇక 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని కూడా నేడు ప్రకటించారు. ఈ కమిటీకి కూడా జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉండనున్నట్టు తెలిపారు. గతంలో కేంద్ర ఎన్నికల కమిటీలో ఉన్న షానవాజ్ హుస్సేన్ కు ఈసారి చోటుదక్కలేదు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ కొత్తగా చేరారు.

బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డు:

  1. జేపీ నడ్డా
  2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  3. రాజ్‌నాథ్ సింగ్
  4. అమిత్ షా
  5. బీఎస్ యడియూరప్ప
  6. సర్బానంద సోనోవాల్
  7. కె.లక్ష్మణ్
  8. సుధా యాదవ్
  9. బిఎల్ సంతోష్
  10. సత్యనారాయణ జాతియా
  11. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ:

  1. జేపీ నడ్డా
  2. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  3. రాజ్‌నాథ్ సింగ్
  4. అమిత్ షా
  5. బీఎస్ యడియూరప్ప
  6. సర్బానంద సోనోవాల్
  7. కె.లక్ష్మణ్
  8. సుధా యాదవ్
  9. బిఎల్ సంతోష్
  10. సత్యనారాయణ జాతియా
  11. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా
  12. భూపేంద్ర యాదవ్
  13. దేవేంద్ర ఫడ్నవిస్
  14. ఓం మాథుర్
  15. వనతి శ్రీనివాసన్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 18 =