స్వాతంత్య్ర వజ్రోత్సవాలు: తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Participates Blood Donation Camp at Telangana Bhavan Today, Blood Donation Camp at Telangana Bhavan Today, MLC Kavitha Participates Blood Donation Camp, Telangana Bhavan, Blood Donation Camp, Telangana Bhavan Blood Donation Camp, TRS MLC Kavitha, TRS MLC Kavitha News, TRS MLC Kavitha Latest News And Updates, TRS MLC Kavitha Live Updates, Mango News, Mango News Telugu,

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్, రాజ్యసభ ఎంపీ కేశవరావుతో కలిసి ఎమ్మెల్సీ కవిత దీనిని ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. కవిత రక్తదానం చేశారు.

రక్తదానం అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్వంతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్‌లో తెరాస ఆధ్వర్యంలో రక్తదానం చేపట్టామని, దీనిలో ఎక్కువమంది పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే దేశాన్ని పట్టి పిడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనవి పేదరికం, నిరుద్యోగం, మతతత్వం అని ఆమె పేర్కొన్నారు. వీటన్నింటిని సమూలంగా రూపుమాపితేనే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని, అప్పుడే భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే దేశం త్వరిత గతిన అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eleven =