బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 విజేత అభిజిత్, చిరు చేతుల మీదుగా ‌ట్రోఫీ

Bigg Boss Telugu - 4 Winner Abhijit,Mango News,Mango News Telugu,Abhijeet,Abhijeet Bigg Boss 4 Winner,Abhijeet Is Crowned Winner,Bigg Boss 4 Finale,Bigg Boss 4 Finale Chiranjeevi,Bigg Boss 4 Finale Contestants,Bigg Boss 4 Finale Highlights,Bigg Boss 4 Finale Nagarjuna,Bigg Boss 4 Winner Abhijeet,Bigg Boss Telugu Season 4,Bigg Boss Telugu 4 Winner Abhijit,Bigg Boss 4 Telugu Winner Abhijit,#BigBossTelugu4,Bigg Boss Telugu 4 Latest Updates,Bigg Boss Telugu 4 Latest news,Bigg Boss Telugu 4 Winner,Bigg Boss Telugu 4 Winner is Abhijeet Duddala,Abhijeet Wins Bigg Boss Season 4,Bigg Boss 4 Telugu,Abhijeet Wins The Bigg Boss Telugu 4 Title

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-4 టైటిల్ ను నటుడు అభిజిత్‌ గెలుచుకున్నాడు. ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజిత్ బిగ్‌బాస్‌ విజేత ట్రోఫీని అందుకున్నాడు. ఈ సీజన్ లో గట్టి పోటీ ఇచ్చిన నటుడు అఖిల్ రన్నరప్‌ గా నిలిచాడు. సెప్టెంబర్ 6 నాడు ప్రారంభమై, 105 రోజుల పాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్న ఈ రియాలిటీ షో డిసెంబర్ 20, ఆదివారంతో ముగిసింది. కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఈ షోని అద్భుతంగా నడిపించారు. అభిజిత్, సోహైల్‌ రియాన్‌, అఖిల్, అరియానా గ్లోరీ, దేత్తడి హారిక, జోర్దార్ సుజాత, నటి దివి, సింగర్ నోయల్‌, డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, హీరోయిన్ మోనాల్‌ గుజ్జార్‌, దర్శకుడు సూర్యకిరణ్, యాంకర్ లాస్య, యాంకర్ దేవి నాగవల్లి, ‌గంగవ్వ, మెహబూబ్‌ దిల్‌సే,‌ కరాటే కల్యాణి మొదటగా బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తరువాత మధ్యలో స్వాతి దిక్షిత్, జబర్దస్త్‌ అవినాష్‌, కుమార్ సాయి వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగుపెట్టారు.

మొత్తం 19 మంది సభ్యులలో అభిజిత్, సోహైల్‌‌ సార్థక్, అఖిల్, అరియానా గ్లోరీ, దేత్తడి హారిక మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ లో మొదటగా హారిక ఎలిమినేట్ అవ్వగా, తరువాత అరియనా గ్లోరీ ఎలిమినేట్ అయ్యారు. అయితే చివరి ముగ్గురిలో బయటకు వెళ్ళడానికి ఇష్టపడిన వారు రూ.25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చని నాగార్జున ఆఫర్ ఇవ్వడంతో సోహైల్‌ అందుకు అంగీకరించి బయటకు వచ్చాడు. ఈ డబ్బులో సోహైల్ తరపున రూ.5 లక్షలు, మెహబూబ్ తరపున రూ.5 లక్షలు అనాధ శరణాలయానికి ఇస్తానని ప్రకటించగా, ఆ పది లక్షలు అనాధ శరణాలయానికి తానే ఇస్తానని, సూట్ కేస్ లో 25 లక్షలు సోహైల్ నే ఉంచుకోమని చెప్పి నాగార్జున గొప్పమనసును చాటుకున్నారు. దీంతో టైటిల్ గెలిచిన అభిజిత్‌ ప్రైజ్‌ మనీలో రూ.25 లక్షలు కోత పడింది. ఇక టైటిల్ విజేత బరిలో నిలిచిన అభిజిత్, అఖిల్ లలో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పొందిన అభిజిత్ విజేతగా నిలిచాడు. షో మొదలైన దగ్గరనుంచి ఆడియన్స్ లో అధికశాతం మందికి ఫేవరేట్ గా నిలిచినా అభిజిత్ యే టైటిల్ గెలుచుకున్నాడు.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-4 ఫినాలే ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చి, వ్యాఖ్యాత నాగార్జునతో కలిసి సందడి చేసారు. హౌస్ మేట్స్ తో సరదాగా మాట్లాడి, తన టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. బిగ్‌బాస్ లో పాల్గొన్న ప్రతిఒక్కరితో మాట్లాడిన చిరంజీవి వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. మెహబూబ్‌కు చిరంజీవి రూ.10 ఆర్థిక సాయం ప్రకటించారు. దివికి తను నటించబోతున్న ఓ చిత్రంలో అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా సోహైల్ తీయబోయే చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తానని పేర్కొన్నారు. ఫినాలే ఎపిసోడ్ లో దర్శకుడు అనిల్‌ రావిపూడి అలరించారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌తో అలరించారు. హీరోయిన్స్ ‌ప్రణీత, లక్ష్మీరాయ్ తమ డాన్సులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజేత అభిజిత్‌ మాట్లాడుతూ, తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. ఈ సీజన్లో మొత్తం 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని ప్రకటించిన నాగార్జున, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-4 ని ముగించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eighteen =