సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ

Chiranjeevi Sye Raa Movie Review, Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie Review, Latest Tollywood Updates 2019, Mango News Telugu, Sye Raa Movie Review, Sye Raa Narasimha Reddy, Sye Raa Narasimha Reddy Movie, Sye Raa Narasimha Reddy Movie Rating, Sye Raa Narasimha Reddy Movie Review, Sye Raa Narasimha Reddy Telugu Movie, Sye Raa Narasimha Reddy Telugu Movie Review

నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, నయనతార, తమన్నా భాటియా, అనుష్క, జగపతి బాబు
కథ: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే: సురేందర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
సంగీతం: అమిత్ త్రివేది (పాటలు)
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జూలియస్ ప్యాకియం
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
విఎఫ్ఎక్స్: కమల్ కణ్ణన్
కాస్ట్యూమ్ డిజైనర్స్: అంజు మోడీ, ఉత్తరా మీనన్, సుష్మిత కొణిదల
నిర్మాత: రామ్ చరణ్
నిర్మాణ కంపెనీ: కొణిదల ప్రొడక్షన్ కంపెనీ
డైరెక్టర్: సురేందర్ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2019

2017లో విడుదలైన ‘ఖైదీ నెం.150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొణిదల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, రామ్ చరణ్ నిర్మాతగా, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరా నరసింహారెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్, పాటలు ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలను పెంచాయి. చిరంజీవిని స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో చూసేందుకు అభిమానులు కోలాహలంతో ఎదురు చూసారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, నయనతార, తమన్నా భాటియా, అనుష్క, జగపతి బాబు తదితరులు నటించగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నేడే విడుదల అయింది.

భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అభిమానులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. స్వతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో రగిలించే ఎమోషనల్ సన్నివేశాల్లో, ఆంగ్లేయులపై దాడి చేసే యాక్షన్ సన్నివేశాలలో, యుద్ధ వీరుడిగా అత్యద్భుతమైన నటన కనబర్చి, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ నటనలో తనకు తానే సాటి అని చిరంజీవి మరోమారు నిరూపించుకున్నారు. క్లైమాక్ సన్నివేశాలలో ఉత్తేజపరిచే డైలాగ్స్ తో, స్క్రీన్ ప్రజెన్స్ తో చిరంజీవి ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లి అభిమానులను ఆసాంతం ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలో ఈ సినిమా కోసం చిరంజీవి పడిన కష్టం, కృషి తెలుస్తుంది. హీరోయిన్స్ గా చేసిన నయనతార, తమన్నా పాత్రల మేరకు ఆకట్టుకునేలా నటించారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, జగపతి బాబు వారి పాత్రల్లో లీనమై పోయి, గొప్ప ప్రదర్శన కనబర్చి సినిమా లో కీలక పాత్ర పోషించారు.

ఇక సాంకేతిక విభాగంలో కూడ ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో మరో మైలురాయిలా నిలుస్తుంది. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు తన కెరీర్ లోనే గొప్ప సినిమాగా నిలిచిపోయేలా పనిచేసారు. నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించిన సన్నివేశాలు తన ప్రతిభకు కొలమానంలా నిలిచి ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. పాటలు చిత్రీకరణ, సన్నివేశాలు గుర్తుండి పోయేలా జూలియస్ ప్యాకియం అందించిన నేపధ్య సంగీతం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సన్నివేశాల నిడివిని కథకు అనుకూలంగా మార్చడంలో ఎడిటర్ ఏ. శ్రీకర్ ప్రసాద్ పాత్ర ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. కమల్ కణ్ణన్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో కళ్ళు చెదిరేలా చేసారు. కొణిదల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా రామ్ చరణ్ ఈ సినిమాను అత్యధిక బడ్జెట్ తో నిర్మించి, అందరిని ఆశ్చర్యపరిచే నిర్మాణ విలువలతో సినిమా తీశారు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో మరోసారి నిలబెట్టారు. దర్శకుడు సురేంద్ర రెడ్డి కథపై పూర్తిగా అధ్యయనం చేసి, అందుకు తగిన స్క్రీన్ ప్లే ను జతచేసి అంచనాలను అందుకున్నారు. విజువల్ గా ఉన్నతంగా, సినిమా ఆసాంతం ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగిస్తూ కథ నుండి పక్కకు వెళ్లకుండా సినిమా తీసి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అన్ని అంశాలున్నా సైరా నరసింహారెడ్డి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని, అద్భుత విజయం సాధించి, కొత్త రికార్డులతో తెలుగు సినిమా చరిత్రకి గౌరవం తెచ్చే విధంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =