కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్

COVID-19, Jr NTR tests negative for Covid-19, Junior NTR, Junior NTR Covid 19, Junior NTR Covid 19 Negative, Junior NTR Covid 19 News, Junior NTR Latest News, Junior NTR Movies, Junior NTR News, Junior NTR RRR, Junior NTR Tested Negative, Junior NTR Tested Negative for Covid-19, Mango News, RRR actor Jr NTR beats Covid, RRR actor Jr NTR tests COVID-19 negative, Young Tiger Junior NTR, Young Tiger Junior NTR Tested Negative for Covid-19

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పరీక్షలో నెగటివ్‌ వచ్చిందని చెప్పడం ఆనందంగా ఉంది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది” అని ఎన్టీఆర్ తెలిపారు.

“కోవిడ్-19 వ్యాధిని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వ్యాధిని మంచి జాగ్రత్తలతో మరియు పాజిటివ్ ఆలోచనలతో జయించవచ్చు. ఈ వ్యాధిపై పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి. ఆందోళన పడకండి. అలాగే మాస్క్ తప్పకుండా ధరించండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − ten =