మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు

Gandhi Jayanti 2019 LIVE Updates, Mango News, PM Modi And Others Pay Tribute To Mahatma Gandhi, PM Modi Pays Tribute To Mahatma Gandhi, PM Modi pays tribute to Mahatma Gandhi at Raj Ghat, PM Modi pays tribute to Mahatma Gandhi on Gandhi Jayanti, PM Modi Pays Tribute To Mahatma Gandhi On His 150th Birth Anniversary

భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీజీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉదయం నుంచి పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్ సందర్శించి మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించారు.

జాతిపితకు నివాళులు అర్పించిన అనంతరం అక్కడ జరిగిన ప్రార్ధనా కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జన్మదినాన్ని ప్రతి రాష్ట్రంలో గొప్పగా జరుపుకుంటున్నారు. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులు, సెలెబ్రిటీలు, క్రీడాకారులు ట్విట్టర్‌లో మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకుంటున్నారు. మరో వైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్‌ఘాట్‌లోనూ ప్రధాని నరేంద్ర మోదీ, లాల్‌బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు నివాళులు అర్పించారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here