ఈ ఏడాది ఆర్థిక‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి ప్రకటన, ఆ ఆర్థికవేత్తలు ఎవరంటే?

2022 Nobel Prize in Economic Sciences has been Awarded to Ben S Bernanke Douglas W Diamond and Philip H Dybvig, Nobel Prize In Economics For Three People, Economic Sciences, Ben Bernanke, Douglas Diamond, Philip Dybvig, Nobel Prize In Economics List, All Prizes in Economic Sciences, Mango News, Mango News Telugu, Nobel Memorial Prize laureates in Economics, Nobel Prize Economics 2022 Winners List, Nobel Economics Prize 2022, Nobel Prize 2022, Winners of the Nobel Prize for Economics, Economics Nobel Prize Winner

ఆర్థిక‌శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు 2022 సంవత్సరానికి గానూ బెన్ ఎస్.బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ.డైమండ్ మరియు ఫిలిప్ హెఛ్. డైబ్విగ్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్‌ బహుమతి లభించింది. బ్యాంకులు మరియు ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనకు గానూ ఈ ముగ్గురుని సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టుగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ మరియు ఫిలిప్ డైబ్విగ్ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచారని చెప్పారు. డగ్లస్ డైమండ్ మరియు ఫిలిప్ డైబ్విగ్ బ్యాంకులు ఎందుకు ఉనికిలో ఉన్నాయి? సహా అనేక సైద్ధాంతిక నమూనాలను అభివృద్ధి చేశారని తెలిపారు. ఇక బెన్ బెర్నాంకే 1930ల మహా మాంద్యం, ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని విశ్లేషించాడని, ఇతర విషయాలతో పాటుగా సంక్షోభం చాలా లోతుగా మరియు సుదీర్ఘంగా మారడంలో బ్యాంక్ రన్ ఎలా నిర్ణయాత్మక కారకంగా ఉందో తెలిపాడని పేర్కొన్నారు. బ్యాంకులు, బ్యాంకు నియంత్రణ, బ్యాంకింగ్ సంక్షోభాలు మరియు ఆర్థిక సంక్షోభాలను ఎలా నిర్వహించాలనే విషయాలపై అవగాహనకు సంబంధించి బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ మరియు ఫిలిప్ డైబ్విగ్ పరిశోధనలు తదుపరిగా చాలా కీలకం కానున్నాయని చెప్పారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీద ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి (డిసెంబర్‌ 10) సందర్భంగా ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారం కింద దాదాపు 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (911, 400 డాలర్లు) ను బహుమతిగా అందజేయనున్నారు. తాజాగా ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించడంతో ఈ ఏడాదికి గానూ నోబెల్ బహుమతుల ప్రకటన పూర్తయింది. వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి నోబెల్‌ బహుమతిని ఇప్పటికే ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 20 =