ఏపీ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష, పలు కీలక నిర్ణయాలు

CM Jagan Held Review on AP Industrial Development and Infrastructure at Tadepalli Camp Office Today, CM Jagan Held Review on AP Industrial Development, CM Jagan Held Review on Infrastructure, Tadepalli Camp Office Today, Mango News, Mango News Telugu, Ys Jagan Reviews Ports And Airports, Ys Jagan Reviews On Industrial Dept, AP State Portal, Andhra Pradesh News Live, AP Industrial Development And Infrastructure, APIIC AP Government, AP Industries, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan Latest News And Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు.

ప్రభుత్వం తరఫు నుంచి ఆయా ప్రాజెక్టులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, సహకారం అందించాలని సీఎం జగన్ సూచించారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిని సమీక్షించిన సీఎం జగన్, 2023 జూన్ నాటికి వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 2023 డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టు పనులు పూర్తి కావాలని, 2024 మార్చి నాటికి రామాయపట్నం పోర్టులో కార్యకలాపాలు ప్రారంభం కావాలని అన్నారు. ఇంకా రెండవ దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మాణాలపై కూడా దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =