ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లోన్ యాప్‌ల వేధింపులపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

AP Govt Set up a Toll Free Number 1930 For Complaints on Loan Apps Harassment, AP Govt Toll Free Number on Loan Apps Harassment, Toll Free Number 1930 on Loan Apps Harassment, Loan Apps Harassment, Loan Apps Incidents In Ap, Mango News, Mango News Telugu, Loan App Issue, Loan Apps, Online Loan Apps, Loan Apps Incidents In AP, Loan Apps In Ap, Ban Loan Apps, Online Loan Apps, Loan Apps In India, AP Assembly

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ప్రైవేట్ లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా రాష్ట్రంలో పలువురు బలవన్మరణానికి పాల్పడుతున్న నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఇకపై రాష్ట్రంలో ఎవరైనా ఈ లోన్ యాప్‌ల నిర్వాహుకుల నుంచి ఏవైనా వేధింపులు ఎదురైతే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సోమవారం టోల్ ఫ్రీ నంబర్‌ ‘1930’ను ప్రకటించింది. ఇకనుంచీ ఎవరూ లోన్ యాప్‌ల ఆగడాల గురించి ఆందోళన చెందవద్దని, ‘1930’ నంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించింది. నేటినుంచే ఈ టోల్ ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించబడతాయని, అంతేకాకుండా వారిపై చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోబడతాయని కూడా అధికారులు స్పష్టం చేశారు. సీఎం జగన్ సూచన మేరకు, ఈ టోల్ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు హోంశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =