ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్, ఓపెన్‌, మహిళల కేటగిరీల్లో భారత్‌ కు కాంస్య పతకాలు

44th Chess Olympiad India-B Team Wins Bronze in Open Section India-A Women Team also Won Bronze Medal, India-A Women Team also Won Bronze Medal, India-B Team Wins Bronze in Open Section, 44th Chess Olympiad, Indian women's team scripted history at the 44th Chess Olympiad, 44th Chess Olympiad by winning the country's first-ever medal in the women's section, first-ever medal in the women's section at the 44th Chess Olympiad, Chess Olympiad Final Day, India-A Women Team, India-B Team, 44th Chess Olympiad News, 44th Chess Olympiad Latest News, 44th Chess Olympiad Latest Updates, 44th Chess Olympiad Live Updates, Mango News, Mango News Telugu,

చెన్నై వేదికగా జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ముగిశాయి. జూలై 28న ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ ఆగస్టు 9 వరకు కొనసాగింది. కాగా ఈ టోర్నీలో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఓపెన్‌ కేటగిరీలో భారత్‌-‘బి’ కాంస్య పతకం, మహిళల విభాగంలో భారత్‌-‘ఎ’ కాంస్యం పతాకాన్ని కైవసం చేసుకున్నాయి. మహిళల విభాగంలో పదో రౌండ్‌ వరకు అగ్రస్థానంలో ఉన్న భారత్-ఎ జట్టు (కోనేరు హంపి, వైశాలి, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణి) మంగళవారం నాడు జరిగిన 11వ రౌండ్లో 1-3తో అమెరికా చేతిలో ఓడిపోవడంతో 17 పాయింట్లతో కాంస్యంతో సరిపెట్టుకుంది. హంపి, వైశాలి తమ గేమ్స్ ను డ్రాగా ముగించగా, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణి ఓడిపోవడంతో భారత్‌ స్వర్ణం ఆశలు దెబ్బతిన్నాయి. ఇక మహిళల విభాగంలో భారత్‌-బి ఎనిమిదో స్థానం, భారత్‌-సీ 17వ స్థానంలో నిలిచాయి.

మరోవైపు ఓపెన్‌ కేటగిరీలో ప్రజ్ఞానంద, గుకేశ్‌, రౌనక్‌ సధ్వాని, నిహాల్‌ సరీన్‌ లతో కూడిన భారత్‌-బి జట్టు ఆఖరి రౌండ్లో 3-1తో జర్మనీపై విజయం సాధించి 18 పాయింట్స్ తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. రౌనక్‌, నిహాల్‌ తమ గేమ్స్ లో నెగ్గగా, గుకేశ్‌, ప్రజ్ఞానంద వారి గేమ్స్ డ్రాగా ముగించారు. ఓపెన్ విభాగంలో భారత్‌కు కాంస్యం దక్కడం ఇది రెండోసారి. 2014 చెస్ ఒలింపియాడ్ లో భారత్‌ తొలిసారిగా కాంస్యాన్ని గెలుచుకుంది. ఇక ఈ విభాగంలో భారత్‌-ఎ నాలుగో స్థానంలో, భారత్‌-సీ జట్టు 31వ స్థానంలో నిలిచాయి. ఇక చెస్ ఒలింపియాడ్ లో వ్యక్తిగత ప్రదర్శనలకుగాను ఏడుగురు భారత్ ప్లేయర్స్ పతకాలు సాధించారు. నిహాల్‌ సరీన్‌, గుకేశ్‌ స్వర్ణ పతకాలు, అర్జున్‌ ఎరిగైసి రజతం, ప్రజ్ఞానంద, వైశాలి, తానియా సచ్ దేవ్, దివ్య దేశ్ ముఖ్ కాంస్య పతకాలు సాధించారు. 1927 నుండి నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ పోటీలు మొదటిసారిగా భారతదేశంలో మరియు 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో నిర్వహించబడ్డాయి. మొత్తం 187 దేశాలు పాల్గొంటుండడంతో చెస్ ఒలింపియాడ్‌లో ఇదే అతిపెద్ద పార్టిసిపేషన్ గా ఉంది. భారత్ తరఫునుంచి మొత్తం 6 జట్లతో 30 మంది ఆటగాళ్లతో కూడిన అతిపెద్ద బృందం ఈ పోటీల్లో పాల్గొంది.

ఓపెన్ కేటగిరి టాప్ ఫైనల్ స్టాండింగ్స్:

  1. ఉజ్బెకిస్థాన్‌ – స్వర్ణం
  2. అర్మేనియా – రజతం
  3. భారత్‌-బి – కాంస్యం
  4. భారత్-ఎ
  5. యూఎస్ఏ
  6. మాల్డోవా

మహిళల కేటగిరి టాప్ ఫైనల్ స్టాండింగ్స్:

  1. ఉక్రెయిన్ – స్వర్ణం
  2. జార్జియా – రజతం
  3. భారత్-ఎ – కాంస్యం
  4. యూఎస్ఏ
  5. కజకిస్తాన్
  6. పోలాండ్

44వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ప్లేయర్స్ వ్యక్తిగత పతకాలు:

  1. నిహాల్‌ సరీన్‌ – స్వర్ణం
  2. గుకేశ్‌ – స్వర్ణం
  3. అర్జున్‌ ఎరిగైసి – రజతం
  4. ప్రజ్ఞానంద – కాంస్యం
  5. వైశాలి – కాంస్యం
  6. తానియా సచ్ దేవ్ – కాంస్యం
  7. దివ్య దేశ్ ముఖ్ – కాంస్యం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =