తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో టీఎంసీ అత్యధిక స్థానాల్లో ముందంజ

5 States Assembly Elections Counting Live Updates,5 States Assembly Election Results 2021 Live,Mango News,Mango News Telugu,West Bengal,Assam,Tamil Nadu,Kerala,Puducherry,Assembly Elections 2021,​Bengal Elections​,West Bengal,​West Bengal Elections​,West Bengal Election Results,​Mamata Banerjee​,Tamil Nadu Election Result,Kerala Election Result,Puducherry Election Result,PM Modi,Counting of votes begins for 5 States Assembly Elections,Election Results 2021,Assembly Elections Counting Live Updates,Election Result 2021 Highlights,Election Result Live Updates,Election Result 2021 Live,Assembly Election Results 2021 Highlights,Election Results 2021 Live
  • బెంగాల్లో 200 పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం, 89 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి.
  • తమిళనాడులో 135 స్థానాల్లో డీఎంకే ఆధిక్యం.
  • కేరళలో 88 స్థానాల్లో ఎల్డీఎఫ్ ముందంజ.
  • అస్సాం 80, పుదుచ్చేరిలలో 12 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యం.
  • పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీ ముందంజలో ఉంది. అయితే నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
  • తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
  • కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
  • అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది.

 

దేశంలో పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో 234, పశ్చిమబెంగాల్ ‌లో 294, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకుంది. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here