చైనాలో ఘోర ప్రమాదం, గ్వాంగ్జీ పర్వతశ్రేణుల్లో కుప్పకూలిన బోయింగ్ విమానం.. 132 మంది దుర్మరణం?

China Eastern Airlines Boeing 737 with 132 Passengers on Board Crashes in Guangxi Region, Chinese Plane Carrying 123 Passenger Crashes At Guangxi No Reports On Casualty, Chinese Plane Carrying 123 Passenger Crashes At Guangxi, No Reports On Casualty, 123 Passenger Plane Crashes At Guangxi, Guangxi, Chinese Plane, Chinese Plane Crashes At Guangxi, China Eastern Boeing 737, China Eastern Boeing 737 crashed in the southern province of Guangxi, Wuzhou, Chinese Plane Crashes, Chinese Plane Crashes Latest News, Chinese Plane Crashes Latest Updates, Mango News, Mango News Telugu,

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 సోమవారం దక్షిణ చైనాలోని కొండలపై కుప్పకూలింది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రాణాలతో బయటపడిన వారి కోసం “ఆల్ అవుట్ రెస్క్యూ ప్రయత్నాలు” ఆదేశించారు. సహాయక బృందాలు ప్లేన్ క్రాష్ సైట్‌కు పంపబడ్డాయి. కున్‌మింగ్ విమానాశ్రయం నుండి స్థానిక కాలమానం ప్రకారం.. 13.15 (IST ఉదయం 10.45) గంటలకు టేకాఫ్ అయిన గంట తర్వాత, ప్రమాదానికి ముందు ఈ విమానం గంటకు 845 కిమీ/గం వేగంతో 8,869 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తోందని అధికారులు తెలిపారు. గ్వాంగ్జీ పర్వతశ్రేణుల వద్ద ఒక్కసారిగా రాడార్ సిగ్నల్ కోల్పోయినట్లు 14.21 (ఉదయం 11.51 am IST)కి గుర్తించబడింది. 14.38 (12.08 pm IST) సమయంలో క్రాష్ అయినట్లు తెలుస్తోందని విమానయాన అధికారులు మరియు చైనా మీడియా నివేదికలు తెలిపాయి.

విమానంలో తొమ్మిది మంది సిబ్బంది సహా 123 మంది ప్రయాణికులు ఉన్నారు. గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించటంతో అక్కడకు చేరుకున్న రక్షణ బృందాలు ఒక కొండపై విమాన భాగాలను గుర్తించారు. గ్వాంగ్జీలోని వుజౌ నగరానికి సమీపంలోని టెంగ్ కౌంటీలోని ఒక గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో విమానం కూలిపోయింది. ఇది ఈ దశాబ్దంలో జరిగిన అత్యంత ఘోరమైన వైమానిక విషాదంగా చెప్తున్నారు. దీనికి ముందు 2010లో హెనాన్ ఎయిర్‌లైన్స్ ఎంబ్రాయర్ ప్రమాదానికి గురైంది. పొగమంచుతో కూడిన వాతావరణంలో అది కూలిపోయి 44 మంది చనిపోయారు. కాగా ఎయిర్ చైనా, చైనా సదరన్ మరియు చైనా ఈస్టర్న్ వంటి చైనా అతిపెద్ద ఎయిర్‌లైన్ ఆపరేటర్లు ఎక్కువగా అడ్వాన్సుడ్ బోయింగ్ మరియు ఎయిర్‌బస్ విమానాలను ఉపయోగిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =