తీహార్ జైలులో కుప్పకూలిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆస్పత్రికి తరలింపు

AAP Leader and Former Delhi Minister Satyendar Jain Admitted To Hospital After Collapsed in Tihar Jail Today,AAP Leader and Former Delhi Minister Satyendar Jain,Satyendar Jain Admitted To Hospital,Minister Satyendar Jain Collapsed in Tihar Jail Today,Mango News,Mango News Telugu,Former Delhi Minister Satyendar Jain,AAP Leader Satyendar Jain,Satyendar Jain collapses in Tihar Jail,Minister Satyendar Jain Latest News,Minister Satyendar Jain Latest Updates,Minister Satyendar Jain Live News,AAP Leader,Former Delhi Minister Satyendar News Today

ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ కుమార్ జైన్ గురువారం తీహార్ జైలులో కుప్పకూలారు. జైలులోని బాత్‌రూమ్‌లో ఆయన కుప్పకూలిపోవడంతో గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆయనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు సీటీ స్కాన్ మరియు ఎంఆర్ఐ సహా అనేక పరీక్షలు చేశారు. జైన్ పరిస్థితి నిలకడగా ఉందని, అయితే అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా మనీ లాండరింగ్ ఆరోపణలపై గత ఏడాది నుంచి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే జైన్‌ను వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడం వారంలో ఇది రెండోసారి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఆయన వెన్నెముకకు గాయం కారణంగా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

మరోవైపు సత్యేందర్ జైన్ తీహార్ జైలులోని వాష్‌రూమ్‌లో పడిపోయిన నేపథ్యంలో.. ఆప్ స్పందించింది. ఆయన అరెస్ట్ అయినప్పటి నుండి దాదాపు 35 కిలోల బరువు తగ్గిన మాజీ మంత్రి స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారని, నిద్రపోతున్నప్పుడు కూడా ప్రత్యేక యంత్రం సాయం అవసరమని పేర్కొంది. జైలులో ఒంటరితనం వల్ల ఆందోళనకు గురవుతున్నారని, ఇటీవల దీనిపై ఆయన కోర్టులో కూడా ప్రస్తావించారని ఆప్ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే జైన్ పలుమార్లు బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. జైన్‌ ఆరోగ్యంపై న్యాయవాది గత వారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో సత్యేందర్ జైన్ ఆరోగ్యంపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఆయన ఆరోగ్యం విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =