నేడు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR To Hold High Level Review Meet with All Collectors SPs and Commissioners at New Secretariat Today,CM KCR To Hold High Level Review Meet,Review Meet with All Collectors SPs and Commissioners,Review Meet at New Secretariat Today,High Level Review Meet at New Secretariat,Mango News,Mango News Telugu,KCR to hold first review meet,CM meeting with collectors today,CM KCR Review Meet Latest News,New Secretariat Latest Updates,CM KCR Latest News and Updates,Collectors Review Meet Latest News,Collectors Review Meet Latest Updates

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నేడు (గురువారం, మే 25, 2023) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవనుంది. కాగా ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. అలాగే 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర కార్యక్రమాలపై కూడా సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్‌ను కూడా ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here