శ్రీవారి సన్నిధిలో రూ.124 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy Lays Foundation Stone For Sri Balaji Oncology Hospital in Tirupati,TTD Chairman YV Subba Reddy,YV Subbareddy Lays Foundation Stone,Foundation Stone For Cancer Hospital,Foundation Stone For Sri Balaji Oncology Hospital,Sri Balaji Oncology Hospital in Tirupati,YV Subba Reddy Foundation For Oncology Hospital,YV Subba Reddy Foundation in Tirupati,Mango News,Mango News Telugu,TTD Chairman YV Subbareddy Latest News,TTD Chairman YV Subbareddy Latest Updates,TTD Chairman Latest News,YV Subbareddy Foundation Stone Latest News,Foundation For Cancer Hospital News Today,Foundation For Cancer Hospital Latest News,Foundation For Cancer Hospital Latest Updates,Sri Balaji Oncology Hospital,Sri Balaji Oncology Hospital Latest News

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి సన్నిధిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆవరణలో దీనికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఇక్కడ ఆంకాలజీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నామని, ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘శ్రీ బాలాజీ ఆంకాలజీ ఆస్పత్రి’ పేరుతో మొత్తం 400 బెడ్స్ కెపాసిటీతో, అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నామని, ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం సుమారు రూ.124 కోట్లు వెచ్చిస్తున్నామని టీటీడీ చైర్మన్‌ తెలిపారు. ఇక ఈరోజు కీలకమైన బ్లాక్‌కు శంకుస్థాపన చేశామని, అత్యధునిక యంత్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనితోపాటు క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, టెస్ట్‌ల కోసం ప్రత్యేకంగా పింక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, చిత్తూరు, తిరుపతి జిల్లా నలుమూలల పింక్ బస్సులు పంపించి స్క్రీనింగ్ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చైర్మన్ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇందుకు దారి తీసిన కారణాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే బస్సులో సాంకేతిక లోపాలేమీ లేవని ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు ఆయనకు వివరించారు. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని వారు చెప్పారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చిన భక్తులను క్షేమంగా తిరుపతికి చేర్చడానికి టీటీడీ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని, మరోసారి ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని, అవసరమైతే డ్రైవర్లకు మళ్ళీ శిక్షణ ఇప్పించాలని చైర్మన్ సుబ్బారెడ్డి సూచించారు. అలాగే డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 20 =