ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా? మీ కోసమే గూగుల్ సరికొత్త ఫీచర్..

Want to learn English Googles new feature is just for you,Want to learn English,Googles new feature is just for you,Googles new feature learn English,Mango News,Mango News Telugu,Google personalized Feedback Feature,Google Translate,Deep Aligner,Google,ESL/EFL, English Lessons, learn English Google's new feature,Googles new feature Latest News,Googles new feature Latest Updates,Googles new feature Live News
Google personalized Feedback Feature,Google Translate,Deep Aligner,Google,ESL/EFL, English Lessons, learn English? Google's new featureq

ఒకప్పుడు టీచర్లు, పెద్దల  దగ్గర నేర్చుకున్న పాఠాలు, పుస్తకాలలో చదువుకున్న జ్ఞానం మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందాక అరచేతిలోనే విజ్ఞానం అందుతుంది. ఏం కావాలన్నా కూడా గూగులమ్మను అడిగి క్షణాల్లో తెలుసుకుంటున్నారు.  అయితే  ఇప్పుడు తన యూజర్లుకు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి వీలుగా ‘పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్’ అనే ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ ప్రవేశ పెడుతోంది. గూగుల్‌లో ఈ కొత్త ఫీచర్ సాయంతో  యూజర్లు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు.

ఇప్పుడు భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, కొలంబియా, మెక్సికోలోని యూజర్లకు ‘పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్’ ఫీచర్‌తో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సాయ పడుతుంది. ఈ కొత్త ఫీచర్ వల్ల  భాష నేర్చుకున్నవాళ్లకు  కొత్త అవకాశాలు రావడంతో పాటు.. విభిన్న సంస్కృతులకు చెందిన వాళ్లతో   కనెక్ట్ అవడానికి సాయపడుతుందని  గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది

నిజానికి ఇంగ్లీష్ అనేది ప్రపంచం మొత్తం పర్యటించడానికి, వాళ్ల కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కూడా సాయపడుతుందని గూగుల్ తెలిపింది. అయినా కూడా కొత్త భాషలో నైపుణ్యం సాధించడం కష్టమే.. కొంత ఏజ్ వచ్చాక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుని అనర్గళంగా దానిని మాట్లాడటమనేది చాలామందికి అంత ఈజీ కాదనే చెప్పొచ్చు. కానీ గూగుల్ ఫీచర్‌తో భాషావేత్తలు, టీచర్లు, ఈఎస్ఎల్,ఈఎఫ్ఎల్  టీచింగ్ ఎక్స్‌పర్ట్‌లతో పార్టనర్ షిప్ కలిగి మెరుగైన లెర్నింగ్ ఎక్స‌ర్‌సైజుల వల్ల యూజర్లు ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా  నేర్చుకోవచ్చు.

ఈ ఫీడ్‌బ్యాక్ ఫీచర్ యూజర్లకు..వాళ్లు మాట్లాడే స్కిల్స్‌పై  సెమాంటిక్ ఫీడ్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది. అంతేకాదు గూగుల్ ఫీడ్‌బ్యాక్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు  3-5 నిమిషాల ప్రాక్టీస్ సెషన్‌ల ఆధారంగా పర్సనలైజడ్ ఫీడ్‌బ్యాక్ కూడా  అందిస్తుంది. అలాగే రోజువారీ రిమైండర్‌ల కోసం కూడా ఒక ఆప్షన్‌ ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకునే సమయంలో ..సరైన అర్దం కోసం గూగుల్ ట్రాన్స్ లేట్ సదుపాయం కూడా ఉంటుంది.దీనివల్ల కరెక్ట్ పదాలను  అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =