అగ్నిపథ్ పథకం: రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ

Agneepath Scheme Indian Army Issued Recruitment Rally Notification Today, Indian Army Issued Recruitment Rally Notification Today, Indian Army Issued Recruitment Rally Notification, Recruitment Rally Notification, Indian Army, Agnipath Protests Live Updates, Agnipath Issue, Agnipath Protests, Agnipath protests in Telangana, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఆర్మీ సోమవారం రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ లో తెలిపారు. అభ్యర్థులందకి ఇకపై ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ (JOININDIANARMY.NIC.IN)లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీలో అగ్నివీరులకు ప్రత్యేక హోదా ఏర్పడుతుందని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌ల కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు.

తాజా నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (10వ తరగతి ఉత్తీర్ణత), అగ్నివీర్ టెక్నికల్ (10+2), అగ్నివీర్ టెక్నికల్ (ఏవియేషన్/అమ్యునిషన్ ఎగ్జామినర్ (10+2)), అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ (10+2), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (10వ తరగతి ఉత్తీర్ణత), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణత) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ లో వయస్సు పరిమితి 17.5 నుంచి 23 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ఉండనున్నాయి. పూర్తి వివరాలు, సమాచారంతో కూడిన రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ ను ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. కాగా అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీరుల కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉంటుందని, ఈ వ్యవధిలో పనితీరుతో సహా ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా కేంద్రీకృత పద్ధతిలో ప్రతి అగ్నివీరుల బ్యాచ్ నుంచి 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌ గా నమోదు చేసి మరో 15 సంవత్సరాల పాటు వారి సేవలను వినియోగించుకోనున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =