ఈవీలతో ఇన్ని తంటాలా?

Are There Really All The Problems With Electric Vehicles,Problems With Electric Vehicles,Are There Really All The Problems,Mango News,Mango News Telugu,Electric Vehicles Problems,Electric Vehicles,Problems With Electric Vehicles,Charging Facility,Petrol Engine Oil, Valve Checks, Injector Cleaning,Tesla ,BMW ,Tata Nexon, Tiago, Mahindra Xuv400,Problems With Electric Vehicles News Today,Electric Vehicles Latest Updates

భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూనే వస్తుంది. వెహికల్ మార్కెట్లో నెమ్మదిగా తమ స్థానాన్ని మెరుగు పరుచుకుంటూ.. మామూలు వాహనాలతో పోటీ పడుతున్నాయి. మన భారతదేశంలో కూడా ఎలక్ఖ్రిక్ కార్లు, బైక్‌లు పెద్ద సంఖ్యలోనే లాంచ్ అవుతున్నాయి.

అందుకే ఇండియాలో ఈవీలపై వస్తున్న ఆదరణను చూస్తున్నప్రతి కంపెనీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో పాటు ఎక్కువ రేంజ్ ఇచ్చే విధంగా తమ వెహికల్స్‌ను తీసుకురావడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో ఈవీలకు ఎంత ఆదరణ ఉంటుందో.. అదే రేంజ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై అపోహలు, అనుమానాలు కూడా ప్రజల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి వినియోగదారులకు ఈవీలపై సరైన అవగాహన లేకపోవడమే కారణమని.. అందుకే ఆ వదంతులు, అపోహలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ధర ఎక్కువ, కానీ నాణ్యత ఉండవు.. పైగా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అంటూ రకరకాలు రూమర్లు మార్కట్లో వినిపించడానికి ఇదే రీజన్ అంటున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు మెయింటెనెన్స్ చాలా అవసరం అన్న వాదన మొదటి నుంచీ వినిపిస్తూనే ఉంది. కానీ ఇది ఓ అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. నిజానికి ఐసీఈ వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలలో రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో లోపల భాగాలు చాలా తక్కువగా ఉంటాయి. టైర్లు, బ్రేక్‌లు, సస్పెన్షన్ వంటి మమూలు భాగాలే ఎలక్ట్రిక్ వాహనాలలో ఉంటాయి.కానీ బయట చక్రాలు తప్ప..ఎలక్ట్రిక్ వాహనాలలో లోపలి భాగాలకు ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదని అంటున్నారు.

అంతేకాదు పెట్రోల్ కార్ల కంటే ఈవీల ధర ఎక్కువ ఎక్కువ అన్న మాటలు కూడా వింటూనే ఉన్నాం. నిజమే ట్రోల్ కారును ఎలక్ట్రిక్ కారుతో పోల్చినప్పుడు, ప్రారంభ కొనుగోలు ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినా కూడా డైలీ రన్నింగ్ ప్రాతిపదికన చూసుకుంటే ..పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల కాస్ట్ చాలా తక్కువ. అలాగే ఇయర్స్ గడిచేకొద్దీ పెట్రోల్ ఇంజిన్ ఆయిల్, వాల్వ్ తనిఖీలు, ఇంజెక్టర్ క్లీనింగ్ వంటి ఎన్నో సర్వీసులు మామూలు వాహనాల్లో అవసరమవుతాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాలలో ఇవేమీ అవసరం లేదు.

అలాగే టెస్లా లేదా బీఎండబ్ల్యూ వంటి ఎలక్ట్రిక్ వాహనాలు కొంచెం ఖరీదైనవే. అయినా కూడా మన దేశంలో టాటా నెక్సాన్, టియాగో, మహీంద్రా ఎక్స్యూవీ 400 వంటి మోడళ్ల వెహికల్స్ సరసమైన ధరలకే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

అంతేకాదు ఎలక్ట్రిక్ కార్ల మూవ్‌మెంట్ నెమ్మదిగా ఉంటుంది స్మూత్ రోడ్లపైన కూడా ఫాస్టుగా వెళ్లవనే పెద్ద అపోహ వీటిపై ఉంటుందని..కానీ ఈవీలను వాడితే మీకే అర్థం అవుతుందని అంటున్నారు నిపుణులు. ఎలక్ట్రిక్ వాహనాల్లో యాక్సెలరేషన్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు టాప్ స్పీడ్ కూడా ఎక్కువగానే ఉంటుందని.. హైవేలపై అయితే 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవని అంటున్నారు.

అలాగే ఈవీలకు మెయిన్ డ్రా బ్యాక్ అయిన ఛార్జింగ్ సౌకర్యం కాస్త ఇబ్బంది కరమే కానీ.. కాస్త ముందుగా చూసుకుంటే ఈ అవసరమే ఉండదంటున్నారు నిపుణులు. కాకపోతే ఇతర దేశాలలో లాగా ఇండియాలో ఎక్కువ ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు లేకపోయినా.. చాలా హైవేలు ఈవీ ఫాస్ట్ ఛార్జర్‌ల సదుపాయాలను కలిగి ఉంటాయి.వీటి బ్యాటరీలను జ్యూస్ అప్ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు తమకు అందుబాటులో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్‌లు ఉన్నాయో.. తయారీదారులతో సహా వివిధ యాప్‌లలో మ్యాప్ చేసి కూడా ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + four =