అంబానీ, అదానీ వెనక్కి..

Those Three Are In The Front Row In The List Of Indian Billionaires,Those Three Are In The Front Row,List Of Indian Billionaires,Three Are In The List Of Indian Billionaires,Mango News,Mango News Telugu,Ambani, Adani, Ambani And Adani, Indian Billionaires,Cyrus Poonawala, Savitri Jindal, Kumar Mangalam Birla,Indian Billionaires Latest News,Indian Billionaires Latest Updates,Indian Billionaires Live News

భారత దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అనగానే.. ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అంబానీ లేదా అదానీ పేరులే. కానీ ఇప్పుడు ఈ లెక్కలు మారాయి. వీరిద్దరినీ వెనక్కి నెట్టేసి మరి మరో ముగ్గురు భాగ్యవంతులు ..వీరి కంటే ఎక్కువ ఎక్కువగా నికర విలువను కలిగిన సంపన్నులుగా పాగా వేసేశారు.

ఈ సంవత్సరం నికర విలువ పెంచుకున్న సంపన్నులలో.. సైరస్ పూనావాలా, సావిత్రి జిందాల్, కుమార్ మంగళం బిర్లా భారత బిలియనీర్ల జాబితాలో ముందు వరుసలో నిలబడ్డారు. వీరి నికర విలువ పూనావాలాకు ఏకంగా 5.01 బిలియన్ డాలర్లు, సావిత్రికి 4.81 బిలియన్ డాలర్లు పెరగగా.. ఇక బిర్లా సంపద 4.43 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ సంపద కేవలం 942 మిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. ఇక గౌతమ్ అదానీ తన సంపద నుంచి 56.7 బిలియన్ డాలర్లు కోల్పోయారు.

అదానీ సంపద ఆవిరి కావటంతో.. ఆసియాలోని బిలీనియర్ల టాప్ జాబితా నుంచి ఆయన పేరు కనుమరుగైపోయింది. ఇక నికర విలువ పరంగా ఆసియాలో గౌతమ్ ఆదానీ రెండవ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు.అంతేకాదు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్-20 జాబితాలో కూడా అదానీ పేరు కనిపించలేదు. 2022లో సంపాదనలో నంబర్‌వన్‌గా ఉన్న అదానీ.. ఈ సంవత్సరం మాత్రం సంపద కోల్పోయారు. హిండెన్‌బర్గ్ షాక్ వల్ల దాదాపు 56.7 బిలియన్ డాలర్లు తక్కువగా.. ఇప్పుడు 63.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానానికి అదానీ పరిమితమయ్యారు.

గత సంవత్సరం అత్యధిక సంపదను కోల్పోయిన బిలియనీర్లు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఈ సంవత్సరం టాప్ గెయినర్లుగా నిలిచి అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 95 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే ఎక్కువ సంపదను ఆర్జించడంలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్..మస్క్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆయన సంపద 63.4 బిలియన్ డాలర్లు పెరిగింది. అలాగే ఆదాయాల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ పేరు.. థర్డ్ ప్లేసులో నిలిచింది. ఈ సంవత్సరం తన నికర విలువను 43.9 బిలియన్ డాలర్ల వరకూ పెంచుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fourteen =