నిమిషానికే అన్ని కోట్లా.. వామ్మో

Do You Know How Much Elon Musk Earns,How Much Elon Musk Earns,Do You Know Elon Musk,Mango News,Mango News Telugu,Elon Musk Wealth,How Much Elon Musk Earns, Car Manufacturing Company Tesla Head , As The Owner Of X, Social Media App,Elon Musk Net Worth 2023,Elon Musk,How Much Does Elon Musk Make A Day,Elon Musk Latest News,Elon Musk Latest Updates,Elon Musk Earnings News Today,Elon Musk Earnings Latest Updates,Elon Musk Earnings Live News

ఎలాన్‌ మస్క్‌.. ఎవరికీ పరిచయం అక్కర లేని పేరు. అత్యంత ఖరీదైన కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేతగా కంటే.. సోషల్‌ మీడియా ప్రముఖ యాప్‌ అయిన ఎక్స్‌ యజమానిగానే. మస్క్ మెజారిటీ జనాలకు తెలుసు. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడయిన మస్క్‌కు కొన్నేళ్లుగా ఆదాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. దీంతో కొన్నేళ్లుగా ప్రపంచ సంపన్నుడుగా మస్క్ కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ఎలాన్ మస్క్‌ ఆదాయం ఎంతనే విషయం చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే ఆయన నిమిషం సంపాదన వింటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. మస్క్ నిమిషం సంపాదన 142,690 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1.18కోట్లు అన్నమాట. ఇక ఒక గంటకు అయితే ఎలాన్‌ మస్క్‌ సంపాదన 8,560,800 డాలర్లు అని అంటే.. భారత కరెన్సీలో రూ. 71 కోట్ల కంటే ఎక్కువ అని తాజాగా ఒక నివేదిక తెలిపింది.

అయితే తాజా నివేదికను మాత్రం ఎలాన్‌ మస్క్‌ కొట్టి పారేశాడు. ఇంకా చెప్పాలంటే దానిని ఒక స్టుపిడ్‌ మ్యాట్రిక్స్‌గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను సంపాదించడం లేదని దానికి బదులు భారీగా నష్టపోవాల్సి వస్తోందని మస్క్ చెబుతున్నాడు. అందుకే ఇలాంటి నివేదికల గురించి తాను పట్టించుకోనని మస్క్‌ తేల్చి చెప్పాడు. నిజానికి తన టెస్లా షేర్లు పడిపోయినప్పుడల్లా ఇంకా ఎక్కువ డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుందని మస్క్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఇటువంటి నివేదికలు నమ్మదగినవి కాదని ఎలాన్ మస్క్‌ చెబుతున్నాడు. నిజానికి ఈ మొత్తం కంపెనీల స్టాక్స్‌ రూపంలోనే తన ఆదాయం ఉందని మస్క్ అంటున్నాడు. టెస్లా స్టాక్‌ యాదృచ్ఛికంగా పడిపోయిన దానికంటే కూడా.. సాంకేతికంగా కూడా తాను ప్రతిసారీ ఎక్కువ నష్టపోతున్నానని ఎలాన్‌ మస్క్‌ చెబుతున్నాడు.

అయితే, మూడేళ్లలో మస్క్‌ ఆదాయం నికర విలువ సెకనుకు సగటున 2,378 డాలర్లు పెరిగిందన్న విషయాన్ని కూడా తాజా నివేదికలో ఉంది. ఈ లెక్కన నిమిషానికి 142,680 డాలర్లు లేదా గంటకు 8,560,800 డాలర్లు మస్క్ సంపాదిస్తున్నాడని ఆ నివేదిక తెలిపింది. దీని ప్రకారం మస్క్ రాత్రి ఎనిమిది గంటలు పాటు నిద్రపోయి ఉదయం లేచినప్పుడు కూడా అతని సంపాదన మరుసటి రోజు ఉదయం 68,486,400 డాలర్లు పెరుగుతుందని తేలింది.

2023 జనవరి నుంచి జూన్‌ వరకు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవోల మొత్తం సంపద ఏకంగా 96.6 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రకారం ప్రస్తుతం, 248.7 బిలియన్‌ డాలర్ల సంపదతో..వరల్డ్‌లోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్‌ మస్క్‌ పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌‌కు టెస్లాలో 23 శాతం వాటా ఉంది. అతని సంపదలో ఇదే గణనీయమైన భాగంగా ఉంది. అలాగే సుమారు మూడింట రెండు వంతులు, టెస్లా విజయంతోనూ మస్క సంపద ముడిపడి ఉంది. ఆ తర్వాత అక్టోబర్‌ 2022లో మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు ఎక్స్ ప్లాట్‌ఫారమ్ (ట్విటర్)ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =