కిలోనివా ద్వారా సైంటిస్టులు ఏం గుర్తించారు?

Are there tons of gold in space,Are there tons of gold,Tons of gold in space,Gold,Collision experiment,tons of gold, scientists discovered Kiliniva,gold in space,Mango News,Mango News Telugu,Is Gold Rare In Space,Treasure Planet is real,gold in the universe,Scientists discovery,Kiliniva Latest News,Kiliniva Latest Updates,Gold in space Latest News,Gold in space Latest Updates
Gold,Collision experiment,Are there tons of gold in space, scientists discovered Kiliniva,gold in space

విశ్వం ఎప్పుడూ అనంత రహస్యాలు  దాగి ఉంచుకునే అద్భుతమే. అందుకే దానిని ఛేదించడానికి మనిషి  నిత్యం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. విశ్వాంతరాలలోకి వెళ్లి మరీ ఖగోళ సైంటిస్టులు, పరిశోధకులు కొత్త విషయాలను  తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈసారి  నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవిస్తుందని చెబుతూ మరో కొత్త అంశంతో  పరిశోధకులు ముందుకొచ్చారు.  అంతరిక్షంలో జరిగే భారీ పేలుళ్ల వల్ల చాలా లోహాలు ఉద్భవిస్తాయని, అలా ఉద్భవించే వాటిలో బంగారం కూడా ఉంటుందని ప్రకటించారు. దీనివల్ల అంతరిక్షంలో టన్నుల టన్నుల బంగారం ఉంటుందని గుర్తించినట్లు..అవే అప్పుడప్పుడు విశ్వంలో జరిగే పేలుళ్ల ద్వారా భూమి మీదకు చేరుకుంటాయని అంటున్నారు.

నిజానికి కిలోనోవా అనేది విశ్వంలోని చాలా తీవ్రంగా జరిగే పేలుళ్లలో ఒకటి. రెండు బలమైన న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొట్టిన తర్వాత సంభవించే పేలుడునే కిలోనోవా అంటారని సైంటిస్టులు చెబుతున్నారు. కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఇలాంటి కిలోనోవా పేలుళ్ల వల్ల భూమిపై చాలా లోహాలు ఏర్పడ్డాయని  అంటున్నారు. వీటిలో బంగారం కూడా  ఉందని  కచ్చితంగా చెబుతున్నారు. అయితే నక్షత్రాలు డీకొట్టడం వల్ల జరిగిన పేలుడు ద్వారా బంగారంతో పాటు కొన్ని లోహాలు భూమికి ఎలా చేరుకున్నాయో తెలుసుకోవడానికి  సరికొత్త నమూనా రూపొందించారు శాస్త్రవేత్తలు. దీనిలో భాగంగానే అసలు ఈ కిలోనోవా పేలుడు ఎలా జరుగుతుంది..పేలుడు  వల్ల ఏం ఏర్పడుతుందనే విషయాలను అధ్యయనం చేశారు.

2017 సంవత్సరంలోనే  ..మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషనల్ ఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్‌డామ్ నుంచి సైంటిస్టులు బృందం కిలోనోవా పేలుడును అధ్యయనం చేసింది. దీనికోసం అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. 2017లో రికార్డ్ చేయబడినది కాకుండా, ఇతర స్టార్స్ రేడియో, ఎక్స్-రే పరిశీలన నుంచి పొందిన మరింత డేటాను కూడా అదనంగా తీసుకున్నారు. అలాగే భూమిపై నిర్వహించిన కొలీషన్ ఎక్స్పెరిమెంట్ నుంచి సేకరించిన ఫలితాలను కూడా క్రోడీకరించారు.

వీటన్నిటిని అధ్యయనాల ఆధారంగా.. రెండు స్టార్స్ తమ శక్తిని కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరిగినప్పుడు.. ఒకదానికొకటి ఢీకొట్టే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా జరిగినప్పుడు విపరీతమైన శబ్దంతో పాటు,ఎక్కువ కాంతి వెలువడుతుందని చెప్పారు. శబ్ధం, వెలుగుతో పాటు కొన్ని అవశేషాలు,లోహాలు కూడా ఉద్భవిస్తాయని చెప్పారు. ఈ అవశేషాలు, లోహాలులో ఒక టీస్పూన్ పదార్థాన్ని కొలిస్తే మిలియన్ టన్నుల బరువు ఉంటుందని తెలిపారు. ఈ లోహాల్లోనే బంగారం కూడా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాకుండా అదే సమయంలో 2 నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల విలీనం అయి మరో కొత్త న్యూట్రాన్ నక్షత్రం తయారవుతుందని గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =