ఉచిత ప్రయాణం ఆర్టీసీకి మేలు చేస్తోందా?

Is free travel good for RTC,Is free travel good,free travel for RTC,TS RTC, Free Travel, CM Revanth reddy, Ponnam Prabhakar,Mango News,Mango News Telugu,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,RTC free travel Latest News,RTC free travel Latest Updates,RTC free travel Live News
TS RTC, Free Travel, CM Revanth reddy, Ponnam Prabhakar

తెలంగాణలోని ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది.  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు ఇక ఆర్టీసీ పని అంతే అని చాలా మంది భావించారు. అయితే ఈ ఉచిత ప్రయాణమే ఆర్టీసీకి కాసుల పంట పండిస్తోంది. అదేంటి ప్రయాణికులను ఉచితంగా తీసుకెళ్తే ఆదాయం ఎలా వస్తుంది.. అనుకుంటున్నారా.. ఇక అసలు విషయానికి వస్తే..

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. అందులో రెండు వెంట‌నే అమ‌లు చేశారు. ఒక‌టి మహాలక్ష్మి పథకం. దీని ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయ‌వ‌చ్చు. రెండోది రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా అర్హత ఉన్న వారికి రూ.10 లక్షల వరకు చేయూత పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆదరణ వ‌స్తోంది. బ‌స్సుల్లో మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ పథకం అమలు అయిన వారం రోజుల వరకు ఎలాంటి ఐడీలు లేకున్నా ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు ఐడీ ఫ్రూప్ త‌ప్ప‌నిస‌రి చేశారు. ఏదైనా ఒక ఐడీ చూపి ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. అయితే ఈ ఉచిత  ప్ర‌యాణ‌మే ఇప్పుడు ఆర్టీసీకి ఆదాయం పెంచేలా చేసింది. ‘మహాలక్ష్మి’ పథకం కింద 20 రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో 6 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు.

సాధార‌ణంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం గా ఉండేది. దీంతో సంస్థ భారీ న‌ష్టాల్లో కూరుకుపోయింది. ఉచిత ప్ర‌యాణం అనంత‌రం బ‌స్సుల్లో ప్ర‌యాణికుల సంఖ్య పెరిగింది. దీంతో జ‌న‌ర‌ల్ గా 88 శాతానికి పెరిగింది. కొన్ని డిపోల్లో అయితు 100 శాతం నమోదవుతోంది. ప్ర‌స్తుతం ఆర్టీసీ బస్సుల్లో . ఈ పథకం మొదలైనప్పటి నుంచి రోజూ సుమారు 40 లక్ష మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో దాదాపు 90 శాతం మంది ఉంటున్నారు. వాస్తవానికి దీని వల్ల ఆర్టీసీకి తీరని నష్టం వాటిల్లుతుందని జనాలు భావించారు. కానీ ఈ పథకం వల్ల ఆర్టీసీకి ప్రభుత్వ రియింబర్స్ మెంట్ కింద భారీ ఎత్తున డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో 13 నుంచి 14 లక్షల ఆదాయం రాగా, ఇప్పుడు 18 నుంచి 25 లక్షల వరకు పెరిగిందని.. ఈ లెక్క‌న ఆర్టీసి మంచి లాభాలు వస్తున్నాయని అంటున్నారు. తాజాగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీకి నెల‌కు రూ. 250 కోట్ల మేర రియంబ‌ర్స్ మెంట్ పేరిట జ‌మ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీని కాపాడుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే కొత్తగా ఎక్స్‌ప్రెస్‌, లహరి స్లీపర్‌ కమ్‌ సీటర్‌, రాజధాని ఏసీ 50 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా, బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో 1,000 ఎల‌క్ట్రిక్ బస్సులు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త బస్సులు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూనే.. ఉద్యోగుల సంక్షేమ, ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, సీసీఎస్‌ బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 92 ఏసీ/నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు, 46 ఏసీ రాజధాని, 912 ఎక్స్‌ప్రె్‌స/పల్లెవెలుగు బస్సులు, మొత్తం 1,050 బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే.. ప్ర‌భుత్వ సంగ‌తి ఏమో కానీ.. ఉచితం ఆర్టీసీకి మేలే చేస్తోంద‌ని సంస్థ సిబ్బంది సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − six =