విభజన బాధలను ఎప్పటికీ మర్చిపోలేము, ఆగ‌స్టు 14ను ఇలా జరుపుకుందాం: ప్రధాని మోదీ

#PartitionHorrorsRemembranceDay, 1947 partition of India, 75th Independence Day, August 14 to be Observed as Partition Horrors Remembrance, history of partition of India, Mango News, Modi says August 14 will be observed as Partition Horrors, Pakistani Independence Day, Partition Horrors Remembrance Day, partition of India, Partition’s pains can never be forgotten, PM Modi Declares 14th August As Partition Horrors Remembrance Day, PM Of India, Prime Minister Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. ఆగ‌స్టు 14వ తేదీని “విభజన గాయాల స్మారక దినం” గా (Partition Horrors Remembrance Day)గా పాటించాలని పిలుపునిచ్చారు. భారత్‌, పాక్‌ విభజన సమయాన్ని గుర్తుచేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. “విభజన బాధలను ఎప్పటికీ మర్చిపోలేము. మన లక్షలాది మంది సోదరీమణులు మరియు సోదరులు నిరాశ్రయులయ్యారు మరియు బుద్ధిహీన ద్వేషం మరియు హింస కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మన ప్రజల పోరాటాలు మరియు త్యాగాల జ్ఞాపకార్థం ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినంగా పాటిద్దాం” అని అన్నారు. సామాజిక విభజన, అసమానత అనే విషాన్ని తొలగించి, ఏకత్వం, సామాజిక సామరస్యం మరియు మానవ సాధికారత యొక్క స్ఫూర్తిని మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని విభజన గాయాల స్మారక దినం మనకు గుర్తుచేస్తుంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + four =