మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్

Australia Prime Minister Anthony Albanese will Visit to India on 08-11 March,Australia Prime Minister Anthony Albanese,Anthony Albanese Visit to India,Australia Prime Minister India Visit,Anthony Albanese to India on 08-11 March,Mango News,Mango News Telugu,Australian PM Albanese to embark on India visit,Aus PM Albanese to Visit India,Australian PM to undertake March 8-11,Aus PM To Visit India Next Week,India Latest News and Updates,India Live News Today

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం మరియు పర్యాటక శాఖ మంత్రి సెనేటర్ డాన్ ఫారెల్, వనరులు అండ్ నార్త్ ఆస్ట్రేలియా మంత్రి మడేలిన్ కింగ్ ఎంపీ, సీనియర్ అధికారులు మరియు ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం కూడా భారత్ కు రానున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ భారత్ లో తొలిసారిగా పర్యటించనున్నట్టు తెలిపారు. ప్రధాని అల్బనీస్ మార్చి 8, హోలీ రోజున గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకుంటారని చెప్పారు. మార్చి 9న ముంబయిని కూడా సందర్చించి, అదే రోజున ఢిల్లీకి చేరుకుంటారు.

“ఢిల్లీలో మార్చి 10న రాష్ట్రపతి భవన్ ముందుభాగంలో ప్రధాన మంత్రి అల్బనీస్‌కు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలతో పాటు సహకార రంగాలపై చర్చించడానికి ప్రధాని మోదీ మరియు ప్రధాన మంత్రి అల్బనీస్ వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం ప్రధాని అల్బనీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశమవుతారు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఉమ్మడి విలువలు మరియు ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా స్నేహపూర్వక సంబంధాలను పంచుకుంటాయని, ప్రధాని అల్బనీస్ పర్యటన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఊపునిస్తుందని భావిస్తున్నాము” అని ప్రకటనలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =