ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ.. చర్చలకు రాకపోతే ఎలా? ఏపీ మంత్రులు

Andhra govt employees strike over pay revision, Andhra Pradesh Government, Andhra Pradesh govt employees, AP Cabinet approves PRC Jeevol-Employees on strike, AP employees reject govt’s talk offer, AP employees reject govt’s talk offer on pay revision, AP Ministers It Is Not Correct For The Employees Not To Come To Talks With The Government Committee, Employees Not To Come To Talks With The Government Committee, Mango News, PRC Issue, PRC Issue in Ap, Staff to wage a united fight against pay revision GOs

ఎలాంటి సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్‌ కాదని అన్నారు. ఈ రోజు కూడా పీఆర్‌సీ సాధన కమిటీ ప్రతినిధులు ప్రభుత్వ కమిటీతో చర్చలకు రాలేదని తెలిపారు. అయితే, తమ పిలుపు మేరకు కొన్ని సంఘాల నాయకులు వచ్చారని, సమస్యలు ప్రస్తావించారని పేర్కొన్నారు. చర్చలకు ఎవరు వచ్చినా మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని.. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని వ్యాఖ్యానించారు.

ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్‌సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా అని ప్రశ్నించారు. జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేదని, ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం మంచిది కాదని, వాళ్ళు ఎప్పుడు చర్చకు వస్తామంటే అప్పుడే చర్చిస్తామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + eighteen =