ఇది ప్రజలకు అనుకూలమైన మరియు ప్రగతిశీల బడ్జెట్, కేంద్రబడ్జెట్ పై పీఎం మోదీ స్పందన

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget session of Parliament, Budget Session of the Parliament 2022, CM KCR, Mango News, Mango News Telugu, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session Live Updates, Parliament Budget Session Updates, PM Modi, pm narendra modi, PM Narendra Modi Says Union Budget-2022-23 is People-friendly And Progressive Budget, Rahul Gandhi Over Budget 2022, Union Budget, Union Budget 2022-23, Union Budget 2022-23 Live Updates, Union Budget 2022-23 Updates, Union Budget-2022-23 is People-friendly And Progressive Budget

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శతాబ్దానికి ఒక‌సారి ఎదుర‌య్యే విప‌త్తుల మ‌ధ్య ఈ ఏడాది బ‌డ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసంతో వ‌చ్చింద‌ని ప్రధాని అన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని అందించడంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. దేశంలో మరిన్ని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మరింత వృద్ధి మరియు ఉద్యోగాల అవకాశాలతో ఈ బడ్జెట్ నిండి ఉందని అన్నారు. ఈ బడ్జెట్ సమకాలీన సమస్యలను పరిష్కరించడమే కాకుండా యువతకు ఉజ్వల భవిష్యత్తును కూడా అందిస్తుందని, ఇది గ్రీన్ జాబ్ సెక్టార్‌ను మరింతగా పెంచుతుందని అన్నారు.

బ‌డ్జెట్‌లోని అత్యంత ప్ర‌ధాన అంశాల‌లో పేద‌ల సంక్షేమం ఒకటి:

రైతుల కోసం డ్రోన్లు, వందే భారత్ రైళ్లు, డిజిటల్ కరెన్సీ, 5జీ సేవలు, జాతీయ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ వంటి దశల ద్వారా జీవితంలోని ప్రతి రంగంలో ఆధునికత మరియు సాంకేతికతతో మన యువతకు, మధ్యతరగతి ప్రజలకు, పేదలకు, దళిత మరియు వెనుకబడిన తరగతులకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ప్రధాని అన్నారు. ఈ బ‌డ్జెట్‌లోని అత్యంత ప్ర‌ధాన అంశాల‌లో పేద‌ల సంక్షేమం ఒక‌ట‌ని, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, మరుగుదొడ్డి, కుళాయి నీరు మరియు గ్యాస్ కనెక్షన్ ఉండేలా బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ఆధునిక ఇంటర్నెట్ కనెక్టివిటీపై కూడా దృష్టి సారిస్తుందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలలో ‘పర్వతమాల’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కొండ ప్రాంతాలకు ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు.

కోట్లాది మంది భారతీయుల విశ్వాసానికి కేంద్రమైన గంగానది ప్రక్షాళనతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి ఐదు రాష్ట్రాల్లో నదుల ఒడ్డున సహజ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఇది ఒక ముఖ్యమైన అడుగు అని, ఇది గంగను రసాయన రహితంగా చేయడానికి కూడా దోహదపడుతుందని అన్నారు. “బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయాన్ని లాభసాటిగా మరియు కొత్త అవకాశాలతో నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కొత్త వ్యవసాయ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్యాకేజీ వంటి చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఎంఎస్‌పీ కొనుగోలు ద్వారా రైతుల ఖాతాల్లో 2.25 లక్షల కోట్ల రూపాయలకుపైగా నగదు బదిలీ అవుతుంది” అని ప్రధాని తెలిపారు.

క్రెడిట్ గ్యారెంటీలో రికార్డు పెరుగుదలతో పాటు, బడ్జెట్‌లో అనేక పథకాలను ప్రకటించామన్నారు. దేశీయ పరిశ్రమల కోసం డిఫెన్స్ క్యాపిటల్ బడ్జెట్‌లో 68 శాతం రిజర్వేషన్ల ద్వారా భారతదేశ ఎంఎస్ఎంఈ రంగం ఎంతో ప్రయోజనం పొందుతుందని, 7.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని, చిన్న మరియు ఇతర పరిశ్రమలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు. ప్రజలకు అనుకూలమైన మరియు ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆమె బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + seventeen =