క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్

Batting Allrounder Yusuf Pathan, Double-World Cup winner Yusuf Pathan, ICC reacts after Yusuf Pathan announces retirement, Mango News, Yusuf Pathan, Yusuf Pathan Announces Retirement, Yusuf Pathan announces retirement from all cricket, Yusuf Pathan Announces Retirement from All Forms of Cricket, Yusuf Pathan Announces Retirement from Cricket, Yusuf Pathan Retirement, Yusuf Pathan Retirement Latest News, Yusuf Pathan Retirement News

టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో యూసఫ్ పఠాన్ ప్రకటన చేశాడు. “అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు, తోటి ఆటగాళ్లు మరియు మొత్తం దేశం అందించిన మద్దతు మరియు ప్రేమకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను” అని యూసఫ్ పఠాన్ పేర్కొన్నారు.

38 ఏళ్ల యూసఫ్ పఠాన్ భారత్ తరపున మొత్తం 57 వన్డేలు, 22 టీ-20 మ్యాచుల్లో ఆడాడు. ‌ఈ రెండు ఫార్మాట్లలో కలిపి 1046 పరుగులు చేయగా, 46 వికెట్లు తీశాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో యూసఫ్ పఠాన్ సభ్యుడుగా ఉన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పలు ప్రాంఛైజీలు తరపున ఆడిన యూసఫ్ పఠాన్ ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఒకసారి, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టును రెండు సార్లు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో మొత్తం 174 మ్యాచ్‌లు ఆడిన యూసఫ్ పఠాన్ 3204 పరుగుల చేయగా, 42 వికెట్లు తీశాడు. ఈ కెరీర్ లో తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌కు యూసఫ్ పఠాన్ ధన్యవాదాలు తెలిపాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − two =