బీసీసీఐ 2020–2021 వార్షిక వేతనాల కాంట్రాక్ట్‌ జాబితా విడుదల

Annual Player Contracts for Team India for the Year 2020-21, bcci, BCCI Announces Annual Player Contracts, BCCI Announces Annual Player Contracts for Team India, BCCI Announces Annual Player Contracts for Team India for the Year 2020-21, BCCI announces annual player retainership 2020-21, BCCI announces Team India annual player contracts, Jasprit Bumrah, Mango News, Rohit Sharma, three players retained in A+ contract list, Virat Kohli

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్‌లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్ మెన్)కు ఈ కాంట్రాక్టులు వర్తించనున్నాయి. A+, A, B, C గ్రేడ్ల కింద మొత్తం 28 మంది ఆటగాళ్ల వార్షిక వేతనాల కాంట్రాక్టులను బీసీసీఐ వెల్లడించింది. ఏడాదికి రూ.7 కోట్లు చొప్పున చెల్లించే A+ గ్రేడ్ లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్ బ్యాట్స్ మెన్‌ రోహిత్‌ శర్మ, పేస్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. ఇక A గ్రేడ్‌ కింద రూ.5 కోట్లు, B గ్రేడ్‌ కింద రూ.3 కోట్లు, C గ్రేడ్ కింద‌ రూ.కోటి చొప్పున ఆటగాళ్లకు చెల్లించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

కొత్త కాంట్రాక్ట్ ల జాబితా:

A+ గ్రేడ్‌ కాంట్రాక్ట్ :

 • విరాట్‌ కోహ్లీ
 • రోహిత్‌ శర్మ
 • జస్ప్రీత్‌ బుమ్రా

A గ్రేడ్ కాంట్రాక్ట్ ‌:

 • చటేశ్వర్‌ పుజారా
 • అజింక్య రహానె
 • శిఖర్‌ ధావన్‌
 • రవిచంద్రన్‌ అశ్విన్‌
 • రవీంద్ర జడేజా
 • రిషభ్‌ పంత్‌
 • హార్దిక్‌ పాండ్య
 • కేఎల్‌ రాహుల్‌
 • మహమ్మద్‌ షమి
 • ఇషాంత్‌ శర్మ

B గ్రేడ్ కాంట్రాక్ట్ ‌:

 • మయాంక్‌ అగర్వాల్
 • భువనేశ్వర్‌ కుమార్‌
 • శార్దూల్‌ ఠాకూర్‌
 • వృద్ధిమాన్‌ సాహా
 • ఉమేశ్‌ యాదవ్‌

‌C గ్రేడ్ కాంట్రాక్ట్ ‌:

 • శ్రేయస్‌ అయ్యర్‌
 • శుభ్‌మన్‌ గిల్‌
 • హనుమ విహారి
 • వాషింగ్టన్‌ సుందర్‌
 • యుజువేంద్ర చాహల్‌
 • కుల్‌దీప్‌ యాదవ్‌
 • నవ్‌దీప్‌సైని
 • దీపక్‌ చాహర్‌
 • అక్షర్‌ పటేల్‌
 • మహ్మద్‌ సిరాజ్‌
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − three =